News March 28, 2024

ఇంటర్ బోర్డు సిబ్బందికి OT పునరుద్ధరణ!

image

TG: ఇంటర్ పరీక్షల సమయంలో అదనంగా పనిచేసిన సిబ్బందికి ఓవర్ టైమ్(OT) అలవెన్స్‌ను పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ఏడాది దీన్ని నిలిపివేయగా, ఉద్యోగుల వినతితో ఈ ఏడాది నుంచి ఇవ్వడానికి అంగీకరించింది. పబ్లిక్ పరీక్షల సమయంలో 40 రోజులు, సప్లిమెంటరీ ఎగ్జామ్స్ టైమ్‌లో 30 రోజులు కలిపి మొత్తం 70 రోజులకు బేసిక్ పే, డీఏతో ఓటీ అలవెన్స్ ఇవ్వనుంది. త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సమాచారం.

Similar News

News October 4, 2024

గోళ్లను బట్టి ఆరోగ్యాన్ని చెప్పొచ్చు: పోషకాహార నిపుణులు

image

గోళ్లు చూసి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయొచ్చని న్యూట్రీషనిస్ట్ సిమ్రున్ చోప్రా చెబుతున్నారు. ‘సన్నగా, మెత్తగా ఉండే గోళ్లు విటమిన్ బి, కాల్షియం, ఐరన్ లోపానికి సూచన కావొచ్చు. స్పూన్‌లా మధ్యలో గుంట పడినట్లుగా ఉండే గోళ్లు రక్తహీనత, లివర్ సమస్యలను, తెల్ల మచ్చలుండే గోళ్లు జింక్ లోపాన్ని సూచిస్తుండొచ్చు. అధిక ధూమపానానికి, థైరాయిడ్, శ్వాసకోశ సమస్యలకు పసుపు రంగు గోళ్లు సూచన కావొచ్చు’ అని వివరించారు.

News October 4, 2024

ఆ దాడులు చట్టబద్ధమైనవే: ఇరాన్ సుప్రీం ఖమేనీ

image

ఇజ్రాయెల్‌పై ఇస్లామిక్ రిపబ్లిక్ దేశాల దాడులు చట్టబద్ధమైనవని ఇరాన్ సుప్రీం లీడ‌ర్‌ ఖమేనీ పేర్కొన్నారు. ఐదేళ్ల త‌రువాత ఆయ‌న బ‌హిరంగ ఉప‌న్యాసం ఇచ్చారు. గ‌త ఏడాది అక్టోబ‌ర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి కూడా చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన‌దిగా ఆయ‌న అభివ‌ర్ణించారు. అఫ్గానిస్థాన్ నుంచి యెమెన్ వరకు, ఇరాన్ నుంచి గాజా, లెబనాన్ వరకు దురాక్ర‌మ‌ణులను తిప్పికొట్టేందుకు ముస్లిం దేశాలు భ‌ద్ర‌త‌ను ప‌టిష్ఠం చేసుకోవాల‌న్నారు.

News October 4, 2024

చంద్రబాబు నిజస్వరూపం బయటపడింది: జగన్

image

AP: తిరుమల లడ్డూ విషయంలో సీఎం చంద్రబాబు నిజస్వరూపాన్ని సుప్రీంకోర్టు ఈరోజు ఎత్తిచూపిందని వైసీపీ చీఫ్ నేత జగన్ అన్నారు. ‘ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మతవిశ్వాసాలను రాజకీయ దుర్బుద్ధితో రెచ్చగొడుతున్నారని సుప్రీంకోర్టు అర్థం చేసుకుంది. అందుకే దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దని, పొలిటికల్ డ్రామాలు చేయొద్దని గట్టిగా స్పందించింది’ అని మీడియా సమావేశంలో జగన్ వ్యాఖ్యానించారు.