News July 30, 2024
రూ.1.30లక్షల కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్
AP: 4 నెలల కాలానికి ₹1.30లక్షల కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. 40 విభాగాలకు చెందిన డిమాండ్లు, గ్రాంట్లకు ఆమోదం లభించేలా బడ్జెట్ రూపొందించింది. పూర్తిస్థాయి బడ్జెట్ను సెప్టెంబర్లో ప్రవేశపెట్టే ఛాన్సుంది. రాష్ట్రంలో ఒకే ఏడాది 2 సార్లు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టడం ఇదే తొలిసారి. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గడువు రేపటితో ముగియనుంది.
Similar News
News October 31, 2024
OU డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ప్రవేశాల గడువు పొడిగింపు
TG: ఉస్మానియా యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు స్వీకరణ గడువును NOV 15 వరకు అధికారులు పొడిగించారు. బీఏ, బీకాం, బీఎస్సీ, పీజీ, పీజీ డిప్లొమా కోర్సుల కోసం అప్లై చేసుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు 4,500 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు.
వెబ్సైట్: http://oupgrrcde.com/
News October 31, 2024
అనకాపల్లి జిల్లాలో స్టీల్ ప్లాంట్?
AP: అనకాపల్లి(D) నక్కపల్లి వద్ద ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఆర్సెలార్ మిట్టల్, నిప్పన్ ఆసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం. మొదటి దశలో రూ.70K కోట్ల పెట్టుబడి పెడతామని ప్రభుత్వానికి ప్రతిపాదన అందించినట్లు తెలుస్తోంది. ప్లాంట్ నిర్మాణానికి 2వేల ఎకరాలు అవసరమని, 2029 నాటికి ఉత్పత్తిని ప్రారంభిస్తామని పేర్కొన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇది పూర్తయితే 20 వేల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా.
News October 31, 2024
కిరణ్ అబ్బవరం ‘క’ మూవీ రివ్యూ
ఓ ఊరిలో అమ్మాయిలు మిస్సవడానికి కారణమెవరు? ఈ కేసులకు హీరోకు సంబంధమేంటి అనే క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో ‘క’ తెరకెక్కింది. డైరెక్టర్లు సుజీత్-సందీప్ కథను నడిపిన తీరు, ఇంటర్వెల్, కర్మ సిద్ధాంతంతో ముడిపెట్టిన క్లైమాక్స్, BGM, కిరణ్ నటన ఆకట్టుకున్నాయి. చివరి 15 నిమిషాల్లో మలుపులు థ్రిల్ చేస్తాయి. ఫస్టాఫ్ కొంచెం స్లోగా ఉంటుంది. స్క్రీన్ప్లేపై దృష్టిపెడితే ఇంకా బాగుండేది.
రేటింగ్: 3/5