News November 19, 2024

OTD: దివిసీమ విషాదానికి 47 ఏళ్లు

image

AP: దివిసీమ ఉప్పెనకు నేటితో సరిగ్గా 47 ఏళ్లు పూర్తయ్యాయి. 1977 NOV 19న అర్ధరాత్రి తాటి చెట్ల ఎత్తున, తీరం నుంచి 8 కి.మీ వరకు అలలు పోటెత్తాయి. కృష్ణా జిల్లాలోని నాలి, సొర్లగొంది, సంగమేశ్వరం, గుల్లలమోద, హంసలదీవి వంటి ప్రాంతాలు తుడిచిపెట్టుకుపోయాయి. నిద్రలో ఉన్నవారు నిద్రలోనే జల సమాధయ్యారు. 10 వేల మందికిపైగా ప్రజలు, దాదాపు పశువులన్నీ మరణించాయి. ఘటన జరిగిన 3 రోజులకు బాహ్య ప్రపంచానికి తెలిసింది.

Similar News

News January 30, 2026

T20 WC నుంచి బంగ్లా తప్పుకోవడం కరెక్ట్ కాదు: సురేశ్ రైనా

image

భద్రతా కారణాల దృష్ట్యా T20 WC నుంచి తప్పుకుంటూ BCB తీసుకున్న నిర్ణయాన్ని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా తప్పుబట్టారు. ‘టోర్నీలో పాల్గొనడానికి బంగ్లా ఇండియాకు వస్తే బాగుండేది. ప్రస్తుతం ఆ జట్టు బలంగా ఉంది. ఇక్కడి పరిస్థితుల్లో ఎలా రాణించాలో స్పిన్నర్లకు తెలుసు. భారత్‌కు రాకూడదనే నిర్ణయంతో ఆర్థికంగా నష్టపోతారు. సాంస్కృతిక ఆహ్వానాన్ని బంగ్లా ప్లేయర్లు మిస్ అవుతారు’’ అని రైనా పేర్కొన్నారు.

News January 30, 2026

తులసి మొక్కలోని మార్పులు దేనికి సంకేతం?

image

తులసిని ఆ ఇంట్లోని స్థితిగతులకు సూచికగా కూడా నమ్ముతారు. నీళ్లు పోయకున్నా అది విపరీతంగా పెరిగితే అనర్థానికి సంకేతమట. పచ్చని మొక్క అకస్మాత్తుగా ఎండిపోతే ఇంటి యజమాని ఆరోగ్యానికి/సంపదకు కీడు జరుగుతుందట. ఆకుల రంగు మారడాన్ని ప్రతికూల శక్తుల ప్రభావంగా పరిగణిస్తారు. అయితే తులసి మొక్కను నిత్యం భక్తితో పూజిస్తూ, సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి ఆటంకాలు తొలగి, ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరుస్తాయని నమ్మకం.

News January 30, 2026

నిజాం నగలను హైదరాబాద్‌కు తరలించే ఆలోచన లేదు: కేంద్రం

image

నిజాం ఆభరణాలు RBI వద్ద సురక్షితంగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు తెలిపింది. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ రాతపూర్వక సమాధానంలో ఈ విషయాన్ని వెల్లడించారు. నిజాంకు చెందిన 173 అత్యంత విలువైన నగలు 1995 నుంచి RBI వాల్ట్స్‌లోనే ఉన్నాయని చెప్పారు. వాటి చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యతను ప్రభుత్వం గుర్తిస్తోందన్నారు. అయితే Hydలో శాశ్వత ప్రదర్శనకు తరలించే అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.