News April 15, 2025

OTD: సంచలనానికి ఏడాది

image

గత ఏడాది ఐపీఎల్‌లో SRH బ్యాటింగ్‌లో ఊచకోతతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించింది. 2024 ఏప్రిల్ 15(సరిగ్గా ఇదే రోజు)న టోర్నీ చరిత్రలో అత్యధిక స్కోరు నమోదు చేసింది. RCBతో జరిగిన మ్యాచులో 20 ఓవర్లలో 287 పరుగులు చేసింది. హెడ్ శతకం, క్లాసెన్ హిట్టింగ్‌తో భారీ స్కోరు చేసి చరిత్ర సృష్టించింది. ఈ ఏడాదీ SRH 286 పరుగులు చేసినా గత రికార్డును చెరపలేకపోయింది. మరి ఈ సీజన్‌లో కొత్త రికార్డు నమోదవుతుందా? కామెంట్.

Similar News

News October 27, 2025

రేపు సీఎంతో క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ

image

AP: సీఎం చంద్రబాబుతో రేపు క్యాబినెట్ సబ్‌ కమిటీ భేటీ కానుంది. కొత్త జిల్లాల ఏర్పాటు, జిల్లా కేంద్రాల మార్పులపై కీలక చర్చ జరగనుంది. ఇప్పటికే వీటిపై ఈ సబ్‌ కమిటీ పలు సూచనలు చేసింది. రేపటి భేటీలో మరింత స్పష్టత రానుంది. డిసెంబర్ 31వ తేదీ లోగా కొత్త జిల్లాల పునర్విభజన పూర్తి చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. నవంబర్ 7వ తేదీన జరిగే క్యాబినెట్ భేటీలో వీటిపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

News October 27, 2025

ఇందిరమ్మ ఇళ్లు: చెల్లింపులో మార్పులు ఎందుకంటే?

image

TG: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపులో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేయడం తెలిసిందే. ఇక నుంచి శ్లాబ్ నిర్మాణం పూర్తయ్యాక ₹2 లక్షలు కాకుండా ₹1.40 లక్షలే ఖాతాల్లో జమ చేయనుంది. ఈ పథకంలో ఉపాధి హామీ కింద 90 రోజుల పనిదినాలు కల్పిస్తుండటం, వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణానికి కేంద్రం అనుమతి ఇవ్వడమే ఇందుకు కారణం. ఇంటి నిర్మాణం పూర్తయ్యాక చివరి విడత ₹లక్షతో కలిపి మిగతా ₹60 వేలను అందించనుంది.

News October 27, 2025

తుఫాను ఎఫెక్ట్.. 22 జిల్లాల్లో సెలవులు

image

AP: మొంథా తుఫాను నేపథ్యంలో 22 జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాల్లో సెలవులు ఇవ్వలేదు. తుఫాను ప్రభావం తీవ్రంగా ఉండే కాకినాడ(D)లో ఇవాళ్టి నుంచి 31వ తేదీ వరకు హాలిడేస్ ఇచ్చారు. మిగతా జిల్లాల్లో 1 నుంచి 3 రోజుల వరకు సెలవులు ప్రకటించారు. అటు రేపు రాత్రికి మచిలీపట్నం-కళింగపట్నం మధ్య తుఫాను తీరం దాటే ఛాన్స్ ఉందని APSDMA తెలిపింది.