News October 19, 2024

OTD: GOAT విరాట్ రికార్డులు

image

రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ఇదేరోజున 2023 WCలో BANతో జరిగిన మ్యాచ్‌లో వివిధ రికార్డులు నెలకొల్పారు. ఈ మ్యాచులో విరాట్ 78వ సెంచరీ చేసి అత్యంత వేగంగా 26వేల ఇంటర్నేషనల్ రన్స్ పూర్తిచేశారు. దీంతో ఆయన WCలో వెయ్యి పరుగులు చేసిన మొదటి NO.3 ఇండియన్ బ్యాటర్‌గా నిలిచారు. ICC వైట్‌బాల్ ఈవెంట్‌లలో అత్యధిక రన్స్ & అత్యధిక సెంచరీలు చేసిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఈ రికార్డులను ఫ్యాన్స్ గుర్తుచేస్తున్నారు.

Similar News

News January 26, 2026

తక్కువ పంట కాలం, అధిక ఆదాయం.. బీర పంటతో సొంతం

image

సీజన్‌తో పనిలేకుండా ఏడాది పొడవునా పండే కూరగాయల్లో బీర ముఖ్యమైంది. ఇది తక్కువ సమయంలోనే చేతికి వస్తుంది. పైగా మార్కెట్‌లో దీనికి డిమాండ్ ఎక్కువ. పందిరి విధానంలో బీర సాగు చేస్తూ, సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి లాభాలు పొందేందుకు అవకాశం ఉంటుంది. ఈ పంటకు ఎండాకాలంలో మంచి డిమాండ్ ఉంటుంది. బీర పంట సాగు, అధిక ఆదాయం రావడానికి కీలక సూచనల కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.

News January 26, 2026

కొచ్చిన్ పోర్ట్ అథారిటీలో ఉద్యోగాలు

image

<>కొచ్చిన్<<>> పోర్ట్ అథారిటీ 7 మెరైన్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు FEB 23 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ(ఎకనామిక్స్/ స్టాటిస్టిక్స్/మ్యాథ్స్), బీటెక్(మెరైన్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 35-40ఏళ్ల మధ్య ఉండాలి. షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. సైట్: https://www.cochinport.gov.in

News January 26, 2026

ఇంటింటికీ ‘Prestige’.. ఫౌండర్‌కు పద్మశ్రీ

image

వంటింట్లో ఉండే వస్తువుల్లో ప్రెషర్ కుక్కర్ ఒకటి. అలాంటి ప్రెషర్ కుక్కర్‌ను మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులోకి తెచ్చిన ఘనత టీటీకే ప్రెస్టీజ్‌ గ్రూప్ అధినేత జగన్నాథానికి దక్కుతుంది. పారిశ్రామిక రంగంలో ఆయన సేవలను గుర్తించిన కేంద్రం మరణానంతరం పద్మశ్రీతో గౌరవించింది. ప్రెషర్ కుక్కర్స్‌లో సేఫ్టీ మెకానిజాన్ని ఆవిష్కరించిన ఆయన ప్రెస్టీజ్‌కు బ్రాండ్‌ను క్రియేట్ చేసి ‘కిచెన్ మొఘల్’ అయ్యారు.