News October 24, 2024
OTD: సచిన్ రికార్డును బ్రేక్ చేసిన కోహ్లీ

టీమ్ఇండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ వన్డేల్లో అత్యంత వేగంగా 10వేల పరుగులు పూర్తిచేసి నేటికి ఆరేళ్లు పూర్తవుతోంది. 2018లో ఇదేరోజున స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 129 బంతుల్లో 157 రన్స్ చేశారు. దీంతో వన్డేల్లో 10,000కు పైగా పరుగులు చేసిన 12వ బ్యాటర్‌గా కోహ్లీ నిలిచారు. 205 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించడంతో సచిన్ టెండూల్కర్(259) పేరిట ఉన్న రికార్డును ఆయన అధిగమించారు.
Similar News
News December 1, 2025
డిసెంబర్ నెలలో పర్వదినాలు

DEC 1: గీతా జయంతి, సర్వ ఏకాదశి
DEC 2: మత్స్య, వాసుదేవ ద్వాదశి, చక్రతీర్థ ముక్కోటి
DEC 3: హనమద్ర్వతం, DEC 4: దత్త జయంతి
DEC 8: సంకటహర చతుర్థి
DEC 12: కాలభైరవాష్టమి
DEC 14: కొమురవెళ్లి మల్లన్న కళ్యాణం
DEC 15: సర్వ ఏకాదశి
DEC 16: ధనుర్మాసం ప్రారంభం
DEC 30: ముక్కోటి ఏకాదశి
News December 1, 2025
చిరు-వెంకీ సాంగ్.. 500 మంది డాన్సర్లతో షూటింగ్

అనిల్ రావిపూడి డైరెక్షన్లో చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీ నుంచి ఓ అప్డేడ్ చక్కర్లు కొడుతోంది. గచ్చిబౌలిలో భారీ సెట్ వేసి మెగాస్టార్-విక్టరీ వెంకటేశ్ కాంబినేషన్లో సాంగ్ షూట్ చేస్తున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. 500 మంది డాన్సర్లతో ఈ పాటను గ్రాండ్‌గా చిత్రీకరిస్తున్నట్లు చెప్పాయి. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ మూవీని 2026 సంక్రాంతి బరిలో నిలపనున్నారు.
News December 1, 2025
విటమిన్-E ఫుడ్స్‌తో చర్మం, గుండె ఆరోగ్యం పదిలం!

విటమిన్-E ఉండే ఆహార పదార్థాలు చర్మం, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయని వైద్యులు చెబుతున్నారు. బాదం, సన్ ఫ్లవర్ గింజలు, పాలకూర, బ్రకోలీ, కివీ, ఆలివ్ నూనె, అవకాడో డైట్లో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు. బాదం, అవకాడో చర్మ ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు గుండె పనితీరును మెరుగు పరుస్తాయంటున్నారు. బ్రకోలీ ఫ్రీ రాడికల్స్‌ను తగ్గిస్తుందని, కివీతో చర్మ ఆరోగ్యంతో పాటు ఇమ్యూనిటీ పెరుగుతుందని చెబుతున్నారు.


