News January 12, 2025
OTD: ఒకే రోజు ఒకే ప్రత్యర్థిపై సెంచరీల మోత

టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ 2016, 2019లో సరిగ్గా ఇదేరోజు ఒకే ప్రత్యర్థిపై సెంచరీల మోత మోగించారు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచుల్లో 2016లో 163 బంతుల్లో 171, 2019లో 129 బంతుల్లో 133 రన్స్ చేసి ఔరా అనిపించారు. అయితే, డబుల్ సెంచరీలను సైతం అలవోకగా చేసే సత్తా ఉన్న రోహిత్.. గత కొన్ని రోజులుగా బ్యాటింగ్‌లో తడబడుతుండటం అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది.
Similar News
News December 23, 2025
కస్టమర్ల మనసు గెలవడానికి ఇన్‌స్టామార్ట్ స్మార్ట్ స్టెప్!

స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ఫిజికల్ స్టోర్స్ తెరుస్తోంది. నేరుగా వెళ్లి వస్తువులు ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. క్వాలిటీ చూపించి కస్టమర్లలో నమ్మకం పెంచడానికి చేస్తున్న చిన్న ప్రయోగం ఇది. స్పీడ్ మాత్రమే కాదు, క్వాలిటీ కూడా బాగుంటుందని చెప్పడానికి గురుగ్రామ్(HR)లో ఈ ‘ఎక్స్పీరియన్స్ సెంటర్’ను ప్రారంభించింది. ఈ స్మార్ట్ స్టెప్ సక్సెస్ అయితే దేశవ్యాప్తంగా మరిన్ని సెంటర్స్ రానున్నాయి.
News December 23, 2025
రైతు కన్నీరు.. దేశానికి ముప్పు!

రైతు <<18647657>>దినోత్సవ<<>> వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నా గిట్టుబాటు ధర లేక రైతన్నలు ఆత్మహత్య చేసుకుంటుండటం కలిచివేస్తోంది. అప్పుల ఊబిలో పడి ఏటా వేల సంఖ్యలో చనిపోతుండటం ఆందోళనకరం. లోకానికి అన్నం పెట్టేవాడు ఆకలి, అవమానంతో ప్రాణాలు వదులుతుంటే ‘జై కిసాన్’ అనే నినాదం మనల్ని వెక్కిరిస్తోంది. పొలం గట్టున రైతు ప్రాణం గాలిలో కలిసిపోతుంటే ఆ పక్కనే ఉన్న పైరు రోదిస్తోంది. రైతు ఆత్మహత్య లేని రోజే దేశానికి నిజమైన పండుగ.
News December 23, 2025
గుచ్చి మష్రూమ్స్ కేజీ రూ.40 వేలు.. ఎక్కడ పెరుగుతాయి?

మంచు కరిగే సమయం, వింటర్ చివరిలో గుచ్చి మష్రూమ్స్ (మొరెల్స్/మోర్చెల్లా ఎస్కులెంటా) సహజంగా పెరుగుతాయి. HP, ఉత్తరాఖండ్, J&K ప్రాంతాల్లో లభిస్తాయి. తడి నేల, రాలిన ఆకుల కింద, దట్టమైన అడవిలో మొరెల్స్ పెరుగుతాయి. సంప్రదాయ వైద్యంతోపాటు ఖరీదైన వంటకాల్లో వినియోగం, అంతర్జాతీయ డిమాండ్‌తో కేజీ రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు పలుకుతాయి. దట్టమైన అటవీ ప్రాంతంలో వారాలపాటు వెతికితే కొంత మొత్తంలో లభిస్తాయి.


