News March 26, 2025
రాష్ట్రవ్యాప్తంగా ULBల్లో ఓటీఎస్ అమలు

TG: జీహెచ్ఎంసీతో సహా అర్బన్ లోకల్ బాడీ(ULB)ల్లో ఆస్తి పన్నుపై వడ్డీ చెల్లింపునకు ‘వన్ టైం సెటిల్మెంట్(OTS)’ పథకాన్ని పురపాలక మంత్రిత్వ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నెల 31 నాటికి ఆస్తిపన్ను బకాయిలు, పెనాల్టీలపై 90 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.
Similar News
News March 27, 2025
JKలో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్‌లో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. కథువాలో భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి. కాగా ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతోంది.
News March 27, 2025
ఈ ట్రెండ్ గురించి తెలుసా?

గత రెండు రోజులుగా ‘గిబ్లి’ ట్రెండ్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఓపెన్ ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మన్ తన X ఖాతా డీపీగా ఏఐ ఇమేజ్ను క్రియేట్ చేసి పెట్టుకున్నారు. దీంతో లక్షలాది మంది యూజర్లు చాట్‌జీపీటీ సాయంతో తమ ఫొటోలను ‘గిబ్లి’ స్టైల్లో ఎడిట్ చేసుకుని షేర్ చేస్తున్నారు. గిబ్లి అనేది జపాన్‌లోని ఓ ప్రఖ్యాత యానిమేషన్ స్టూడియో.
News March 27, 2025
IT కంపెనీలు, ఉద్యోగులకు Shocking News

దేశీయ IT కంపెనీలకు పెద్ద చిక్కే వచ్చి పడింది. పరిశ్రమ మొత్తం ఫోకస్‌ను మరోవైపు షిప్ట్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. కస్టమర్లు తమ ప్రాజెక్టుల డెడ్‌లైన్ తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. 60% ప్రాజెక్టుల్లో కోత తప్పదని Forrester తెలిపింది. గతంలో 3-5 ఏళ్లు తీసుకున్న ప్రాజెక్టులను 18 నెలల్లోనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారని పేర్కొంది. ఇది కంపెనీల ప్రాఫిట్, ఉద్యోగుల ఉపాధికి గండి కొట్టనుంది.