News November 30, 2024

OTT యూజర్స్ బీ అలర్ట్! 23 దేశాల్లో భారీ స్కామ్

image

Netflix యూజర్లే లక్ష్యంగా 23 దేశాల్లో భారీ సైబర్ స్కామ్ జరుగుతోందని బిట్‌డిఫెండర్ హెచ్చరించింది. క్యారెట్ ఆన్ స్టిక్ విధానంలో యూజర్లను బురిడీ కొట్టిస్తున్నారంది. ‘మీ పేమెంట్ ప్రాసెసింగ్‌లో ఇష్యూ తలెత్తింది’, ‘మీ పేమెంట్ ఫెయిలైంది. వివరాలు చెక్ చేసుకోండి’ అంటూ fake links పంపిస్తున్నారు. అందులో పేర్లు, క్రెడిట్ కార్డు డీటెయిల్స్ నమోదు చేయగానే డబ్బులు కొట్టేస్తున్నారు. ఇలాంటి మెసేజులు మీకూ వచ్చాయా?

Similar News

News November 16, 2025

అది ఛేజ్ చేయగలిగే టార్గెటే: గంభీర్

image

టెస్టుల్లో ఆడాలంటే స్కిల్‌తో పాటు మెంటల్ టఫ్‌నెస్ ఉండాలని IND హెడ్ కోచ్ గంభీర్ అన్నారు. SAతో తొలి టెస్టులో <<18303459>>ఓటమి<<>> అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ‘124 ఛేజబుల్ టార్గెటే. పిచ్ ఆడేందుకు వీలుగానే ఉంది. ఇలాంటి పిచ్‌పై ఆడాలంటే టెక్నిక్, టెంపెరమెంట్ ఉండాలి. ఫాస్ట్ బౌలర్లకే ఎక్కువ వికెట్లు పడ్డాయి. మేం అడిగిన పిచ్‌నే క్యూరేటర్ తయారు చేశారు. బాగా ఆడనప్పుడు ఇలాగే జరుగుతుంది’ అని పేర్కొన్నారు.

News November 16, 2025

భారీ జీతంతో CSIR-SERCలో ఉద్యోగాలు

image

CSIR-స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ సెంటర్ (SERC) 30 సైంటిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 21 నుంచి డిసెంబర్ 22 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 32 ఏళ్లు. ఎంపికైన వారికి నెలకు రూ.1,38,652 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://serc.res.in/

News November 16, 2025

మేం కాంగ్రెస్‌కు కాదు.. నవీన్‌కు సపోర్టు చేశాం: అసదుద్దీన్

image

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో వ్యక్తిగతంగా నవీన్ యాదవ్‌కు సపోర్టు చేశామని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు. కానీ కాంగ్రెస్‌కు మద్దతిచ్చినట్లుగా కొందరు అర్థం చేసుకున్నారన్నారు. నియోజకవర్గాన్ని నవీన్ అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్‌తో తమకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. కేసీఆర్ అయినా, తానైనా మా పార్టీలకు మంచి అనిపించేది చేసుకుంటూ వెళ్తామని చెప్పారు.