News March 17, 2025
OUలో పీహెచ్డీ ప్రవేశాలకు గడువు పొడిగింపు

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని ఫ్యాకల్టీల కేటగిరి 2 పీహెచ్డీ సీట్ల భర్తీకి నిర్వహించనున్న ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసేందుకు గడువును పొడిగించినట్లు ఓయూ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి తెలిపారు. రూ. 2000 అపరాధ రుసుంతో ఈనెల 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ప్రవేశ పరీక్షలు వచ్చేనెల 25 నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు.
Similar News
News November 1, 2025
పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలి: భద్రాద్రి ఎస్పీ

పెండింగ్‌లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి న్యాయ అధికారులతో సమన్వయం పాటిస్తూ ప్రతి ఒక్కరూ భాద్యతగా పనిచేయాలని ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. ఈ నెల 15న జరగనున్న స్పెషల్ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ రోజు జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో పోలీస్, కోర్ట్ డ్యూటీ ఆఫీసర్స్‌తో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పోలీస్ స్టేషన్ల వారీగా పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
News November 1, 2025
విజయనగరంలో బిర్సా ముండా జయంతి వేడుకలు

విజయనగరం గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా జన జాతీయ గౌరవ దివాస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గిరిజన స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, గాం గంటం దొర, పండు పడాల్ వంటి నాయకుల త్యాగాలను స్మరించారు. విద్యార్థులతో మెగా ర్యాలీ, మొక్కలు నాటడం, ఆటల పోటీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. నవంబర్ 15న జరిగే మెగా ఈవెంట్‌కు సిద్ధంగా ఉన్నామని గిరిజన సంక్షేమ అధికారి తెలిపారు.
News November 1, 2025
సంగారెడ్డి: 6, 7 తేదీల్లో రాష్ట్ర స్థాయి కళా ఉత్సవ పోటీలు

జిల్లా స్థాయిలో నిర్వహించిన కళా ఉత్సవ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ఈనెల 6, 7 తేదీలలో రాష్ట్ర స్థాయి కళా ఉత్సవ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శనివారం తెలిపారు. డీఈఓ మాట్లాడుతూ.. ఈ పోటీలు హైదరాబాద్‌లోని టీఎస్ఐఆర్డీ రాజేంద్ర నగర్లో జరుగనున్నాయని పేర్కొన్నారు. ఈ పోటీలకు విద్యార్థులను సన్నద్ధం చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు.


