News March 17, 2025

OUలో పీహెచ్‌డీ ప్రవేశాలకు గడువు పొడిగింపు

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని ఫ్యాకల్టీల కేటగిరి 2 పీహెచ్‌డీ సీట్ల భర్తీకి నిర్వహించనున్న ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసేందుకు గడువును పొడిగించినట్లు ఓయూ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి తెలిపారు. రూ. 2000 అపరాధ రుసుంతో ఈనెల 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ప్రవేశ పరీక్షలు వచ్చేనెల 25 నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు.

Similar News

News April 23, 2025

జమ్ములో ఉగ్ర దాడి.. తీవ్రంగా ఖండించిన ఎంపీ

image

జమ్ము కశ్మీర్‌లో మంగళవారం టూరిస్ట్‌లపై ఉగ్రవాదులు దాడికి తెగబడిన విషయం తెలిసిందే. దీనిపై ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి స్పందించారు. ట్రెక్కింగ్‌కు వెళ్లిన పర్యాటకులపై కాల్పులు జరపడం తనను కలిచి వేసిందన్న ఆయన.. నిందితులను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని కోరారు. దేశ సరిహద్దులో మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా ఉగ్రవాదులకు గట్టిగా బుద్ది చెప్పాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

News April 23, 2025

ఇవాళే పోలింగ్

image

TG: హైదరాబాద్ స్థానిక సంస్థల MLC ఎన్నికల పోలింగ్ ఇవాళ జరగనుంది. ఉ.8 నుంచి సా.4 వరకు ఓటింగ్ కొనసాగనుంది. 81మంది కార్పొరేటర్లు, 31మంది ఎక్స్‌అఫీషియో సభ్యులు ఓటు వేయనున్నారు. ఈ ఎన్నికలో MIM నుంచి మీర్జా రియాజ్, BJP నుంచి గౌతంరావు పోటీలో ఉన్నారు. MIMకు 50, BJPకి 24, BRSకు 24, INCకి 14 మంది ఓటర్లు ఉన్నారు. పోటీకి దూరంగా ఉన్న INC, BRS ఓట్లు ఎవరికి వేస్తారనే ఉత్కంఠ నెలకొంది. ఎల్లుండి కౌంటింగ్ జరుగుతుంది.

News April 23, 2025

పెనమలూరు: ఉరి వేసుకుని ఇంజినీరింగ్ విద్యార్థి మృతి

image

కృష్ణాజిల్లా పెనమలూరు మండలం కానూరులోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో ఉరివేసుకుని విద్యార్థిని మృతి చెందింది. ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న యార్లగడ్డ ఖ్యాతి (20) హాస్టల్ రూమ్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పెనమలూరు పోలీసులు తెలిపారు.

error: Content is protected !!