News March 5, 2025
OUలో వివిధ కోర్సుల పరీక్షా ఫలితాల విడుదల

ఉస్మానియా యూనివర్సిటీ దూరవిద్య కేంద్రమైన ప్రొఫెసర్ జి.రామ్‌రెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా అందించే వివిధ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ఎంబీఏ రెగ్యులర్ పరీక్ష ఫలితాలతో పాటు డిగ్రీ కోర్సుల సప్లమెంటరీ రివాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు.
Similar News
News March 22, 2025
HYD: వరదల్లో కొట్టుకొచ్చిన శిశువు మృతదేహం (PHOTO)

హైదరాబాద్‌లో శిశువు మృతదేహం కలకలం రేపింది. అర్ధరాత్రి హైటెక్ సిటీలో భారీ వర్షానికి వరదలు వచ్చాయి. మెడికవర్ హాస్పిటల్ ముందున్న మ్యాన్ హోల్ వద్ద ఓ పసికందు మృతదేహం కొట్టుకొచ్చింది. గమనించిన వాహనదారులు వెంటనే లోకల్ PSకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News March 22, 2025
HYD: ఇన్‌స్టాలో పరిచయం.. హోటల్‌లో అత్యాచారం

అల్వాల్ PSలో ఇద్దరు బాలికలు అదృశ్యమైనట్లు ఫిర్యాదు అందింది. దర్యాప్తులో బాలికలు ఓ హోటల్ గదిలో ప్రత్యక్షమయ్యారు. పోలీసుల వివరాలలా.. దమ్మాయిగూడకు చెందిన సాత్విక్ (26), కాప్రాకు చెందిన మోహన్‌చందు (28)లకు మచ్చ బొల్లారానికి చెందిన బాలికలతో ఇన్‌స్టాలో పరిచయం అయింది. యువకుల మాటలు నమ్మి బాలికలు 3 రోజుల క్రితం కుషాయిగూడలోని ఓ హోటల్‌కు వెళ్లగా లైంగికదాడి చేశారు. కేసు నమోదైంది.
News March 21, 2025
పత్రికల్లో కథనాలు తప్పా? నివేదికలు తప్పా?: సీతక్క

గ్రామాల్లో తాగునీటి సమస్యలు ఉన్నాయని పత్రికలు, సోషల్ మీడియాలో వచ్చే తప్పా..? తప్పా? ఏ సమస్యలు లేవంటూ అధికారులు ఇస్తున్న నివేదికలు తప్పా? అని మంత్రి సీతక్క అధికారులను ప్రశ్నించారు. ఎర్రమంజిల్‌లోని మిషన్ భగీరథ కార్యాలయంలో మంత్రి సీతక్క ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తాగునీటి సమస్యలు లేకుండా చూడాలని ఈ సందర్భంగా అధికారులకు ఆమె స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.