News March 17, 2025
OUలో పీహెచ్‌డీ ప్రవేశాలకు గడువు పొడిగింపు

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని ఫ్యాకల్టీల కేటగిరి 2 పీహెచ్‌డీ సీట్ల భర్తీకి నిర్వహించనున్న ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసేందుకు గడువును పొడిగించినట్లు ఓయూ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి తెలిపారు. రూ. 2000 అపరాధ రుసుంతో ఈనెల 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ప్రవేశ పరీక్షలు వచ్చేనెల 25 నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు.
Similar News
News March 17, 2025
రేపు ఢిల్లీకి చంద్రబాబు

AP: అమరావతి పున: ప్రారంభ పనుల ఆరంభోత్సవానికి PM మోదీని ఆహ్వానించేందుకు CM చంద్రబాబు రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. పీఎంతో ఆయన బుధవారం భేటీ కానున్నారు. ప్రపంచ బ్యాంకు నిధులు, అమరావతికి సాయం సహా వివిధ అంశాలపై ఆయన మోదీతో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మల సహా పలువురు కేంద్రమంత్రులతో సమావేశమవుతారని సమాచారం.
News March 17, 2025
HYDలో ఔరంగజేబు వెనక్కి తగ్గాడు

‘ఛావా’ చూసిన అందరికీ ఔరంగ జేబు క్రూరత్వం తెలిసే ఉంటుంది. 17వ శతాబ్దంలో ఆయన HYD వచ్చినట్లు చరిత్ర చెబుతోంది. గోల్కొండ కోట ఆక్రమించుకుని హిందూ దేవాలయాలు ధ్వంసం చేయాలని HYD వచ్చాడు. ఇక్కడ ధ్యానాంజనేయ ఆలయంలో ఓ శబ్దం విన్నాడు. ‘హే రాజన్ మందిర్ తోడ్నా హైతో పెహ్లే తుమ్ కరో మన ఘట్’ అనే రామదూత స్వరం విని వెనక్కి తగ్గాడని, అప్పటినుంచి ఈ ప్రాంతాన్ని కర్మన్‌ఘాట్‌గా పిలుస్తున్నారని స్థల పురాణం చెబుతోంది.
News March 17, 2025
నరసరావుపేట: రైలు కిందపడి గుర్తు తెలియని మహిళ ఆత్మహత్య

నరసరావుపేట టిడ్కో గృహాల సమీపంలోని రైలు పట్టాల వద్ద డోన్ ఎక్స్‌ప్రెస్ రైలు కిందపడి గుర్తు తెలియని మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే ఎస్ఐ శ్రీనివాసరావు నాయక్ తెలిపారు. ఎస్ఐ మాట్లాడుతూ.. మృతురాలు నీలం రంగు డిజైన్ చీర, నీలం రంగు జాకెట్టు ధరించినట్లు చెప్పారు. మృతురాలిని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచినట్లు తెలిపారు. వివరాలు తెలిసిన వారు స్థానిక రైల్వే పోలీసులను 9440438256 సంప్రదించాలన్నారు.