News March 5, 2025

OUలో వివిధ కోర్సుల పరీక్షా ఫలితాల విడుదల

image

ఉస్మానియా యూనివర్సిటీ దూరవిద్య కేంద్రమైన ప్రొఫెసర్ జి.రామ్‌రెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా అందించే వివిధ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ఎంబీఏ రెగ్యులర్ పరీక్ష ఫలితాలతో పాటు డిగ్రీ కోర్సుల సప్లమెంటరీ రివాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు.

Similar News

News March 5, 2025

ఓయూ ఎంబీఏ కోర్సుల పరీక్షా తేదీల ఖరారు

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంబీఏ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ఎంబీఏ (ఈవినింగ్), ఎంబీఏ (టెక్నాలజీ మేనేజ్మెంట్ – ఈవినింగ్) కోర్సుల మూడో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలను ఈ నెల 11వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్‌సైట్‌లో చూసుకోవాలని సూచించారు.

News March 5, 2025

HYD: బీజేపీ నిర్ణయం దుర్మార్గం: కేటీఆర్

image

ఆదిలాబాద్‌లోని సీసీఐ ఫ్యాక్టరీని తుక్కు కింద అమ్మేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సిద్ధంకావడం దుర్మార్గమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. సీసీఐని పునఃప్రారంభిస్తామని పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చి ఓట్లు దండుకున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రయోజనాలంటే బీజేపీకి పట్టింపు లేదని, ఆ సంస్థను స్క్రాప్ కింద అమ్మాలని చూస్తుండటం ప్రజలను వంచించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.

News March 4, 2025

GEFI & శ్రీ అన్నపూర్ణ ఫుడ్స్ జాయింట్ వెంచర్‌

image

HYDకు చెందిన జెమిని ఎడిబుల్స్& ఫ్యాట్స్, కోయంబత్తూరుకు చెందిన మసాలా బ్రాండ్ శ్రీ అన్నపూర్ణ ఫుడ్స్‌ జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేశాయి. ఈ మేరకు మంగళవారం ప్రెస్‌మీట్‌లో సంస్థల ప్రతినిధులు ప్రకటించారు. బ్రాండింగ్& పంపిణీకి రూ.70 కోట్లు, రాబోయే రెండేళ్లలో మరో రూ.50 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో చంద్రశేఖర రెడ్డి, విజయ్ ప్రసాద్, అక్షయ్ చౌదరి, తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!