News March 31, 2025
OU దూర విద్యలో ప్రవేశాలకు రేపు లాస్ట్ డేట్

ఓయూ దూరవిద్యా కేంద్రమైన ప్రొఫెసర్ జి.రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్(పీజీఆర్ఆర్సీడీఈ)లో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫేజ్-2 కింద UG, PG, డిప్లోమా కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. ఇప్పటికే ప్రారంభమైన ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ గడువు రేపటితో ముగియనుంది. అర్హులైన వారు మార్చి 31లోగా అప్లికేషన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
Similar News
News November 4, 2025
సర్కారు వారి పాట.. ఎకరం రూ.99 కోట్లు

రూ.1,2 కోట్లు కాదు.. రూ.99 కోట్లు.. ఇదీ కోకాపేటలోని ఒక ఎకరానికి ప్రభుత్వం నిర్ణయించిన కనీస ధర. ఈ మొత్తం చెల్లిస్తే ఎకరం సొంతం చేసుకోవచ్చు అనుకుంటే పొరపాటే. దీనికి వేలం వేస్తారు. అంటే ఈ రేటు డబుల్ కావచ్చు. ఈ నెల 24, 28 తేదీలతోపాటు వచ్చేనెల 3, 5 తేదీల్లో ప్రభుత్వం ఈ-వేలం వేయనుంది. ఈ మేరకు సర్కారు నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో కనీసం రూ.150 కోట్లైనా సంపాదించాలని సర్కారు భావిస్తున్నట్లు సమాచారం.
News November 4, 2025
మరికొద్ది గంటల్లో హైదరాబాద్లో వర్షం

రానున్న 2-3 గంటల్లో నగరంలో తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందని స్థానిక వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముండగా, ఉపరితల గాలి వేగం గంటకు 40 కి.మీలోపు ఉండే అవకాశం ఉందని సూచించింది. ప్రజలు వర్షం సమయంలో జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.
News November 4, 2025
వచ్చేనెలలో పుస్తకాల పండుగ.. నగరం సిద్ధమా?

HYDలో బుక్ ఫెయిర్.. ఈ పేరు వింటే చాలు పుస్తక ప్రేమికులు పులకించిపోతారు. ఏటా నగరంలో జరిగే ఈ వేడుక కోసం ఎదురు చూస్తుంటారు. ఈ ఏడాది ఈ ఫెస్టివల్ వచ్చేనెలలో జరగబోతోంది. ఎన్టీఆర్ స్టేడియంలో DEC 19 నుంచి 10 రోజుల పాటు పుస్తక ప్రదర్శన నిర్వహిస్తున్నారు. కేవలం పుస్తక విక్రయాలే కాకుండా సాహితీ చర్చలు, పుస్తక ఆవిష్కరణలు ఉంటాయని బుక్ ఫెయిర్ అధ్యక్ష, కార్యదర్శులు యాకూబ్, శ్రీనివాస్ తెలిపారు.


