News March 25, 2025
OU వీసీ సర్కులర్పై అసెంబ్లీలో బీఆర్ఎస్ తీర్మానం

OU వీసీ జారీ చేసిన అప్రజాస్వామిక సర్కులర్ను రద్దు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. విద్యార్థుల హక్కులను హరించే ఈ ఉత్తర్వులపై అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇవ్వనున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తప్పుబడుతూ.. చర్చ జరిపేందుకు పట్టుబడుతున్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దని, తక్షణ చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. ప్రభుత్వ వైఖరి మారకపోతే తీవ్ర ఉద్యమానికి సిద్ధంగా ఉండాలని సూచించారు.
Similar News
News December 13, 2025
రేపు సూర్యపేట జిల్లాలో కేటీఆర్ పర్యటన

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం సూర్యాపేట జిల్లాలో పర్యటించనున్నారు. నూతనకల్ మండలం లింగంపల్లిలో కాంగ్రెస్ నాయకులు చేతిలో ఇటీవల హత్యకు గురైన బీఆర్ఎస్ నాయకుడు ఉప్పల మల్లయ్య కుటుంబాన్ని మాజీ మంత్రి కేటీఆర్, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మల్లయ్య కుటుంబాన్ని పరామర్శించనున్నారు.
News December 13, 2025
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

<
News December 13, 2025
సైబర్ నేరగాళ్లపై కరీంనగర్ సీపీ ఉక్కుపాదం

టెక్నాలజీపై పట్టున్న కరీంనగర్ CP గౌస్ ఆలం ఆర్థిక నేరగాళ్లను వేటాడుతున్నారు. సైబర్ క్రైమ్ కంప్లైంట్ వచ్చిన వెంటనే కేసును చేధిస్తూ బాధితులలో భరోసా నింపుతున్నారు. ఇటీవల సంచలనం సృష్టించిన మేటా ఫండ్ కింగ్ పిన్ లోకేశ్వర్ను పట్టుకొని కటకటాల్లోకి పంపారు. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో 2025 సంవత్సరంలో 281 సైబర్ కేసులు నమోదయ్యాయి. రూ.90,77,918 రికవరీ చేసి బాధితులకు అందించారు.


