News March 25, 2025

OU వీసీ సర్కులర్‌పై అసెంబ్లీలో బీఆర్ఎస్ తీర్మానం

image

OU వీసీ జారీ చేసిన అప్రజాస్వామిక సర్కులర్‌ను రద్దు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. విద్యార్థుల హక్కులను హరించే ఈ ఉత్తర్వులపై అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇవ్వనున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తప్పుబడుతూ.. చర్చ జరిపేందుకు పట్టుబడుతున్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దని, తక్షణ చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. ప్రభుత్వ వైఖరి మారకపోతే తీవ్ర ఉద్యమానికి సిద్ధంగా ఉండాలని సూచించారు.

Similar News

News April 21, 2025

శ్రీకాళహస్తి: జైన సన్యాసినిగా మారనున్న 17 ఏళ్ల యువతి

image

శ్రీ కాళహస్తికి చెందిన జైన్ సునీల్ జైన్ ప్రథమ కుమార్తె కాషిష్ జైన్ 17 సంవత్సరాల వయసులోనే ఆధ్యాత్మిక జీవితాన్ని ఎంచుకున్నారు. స్థానిక కళ్యాణ మండపంలో ఆదివారం నిర్వహించిన అభినందన సభలో ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆమెను సత్కరించారు. వచ్చే నెల 3న నాశిక్‌లో తమ గురువులు మహాసతి, ప్రమోద్ ముని మారా సాహెబ్ ద్వారా ఆమె సన్యాసిగా మారనున్నట్లు తెలిపారు.

News April 21, 2025

కడప: తాగిన మైకంలో గొంతు కోసుకున్న యువకుడు

image

కడపలో ఇమ్రాన్ మద్యం మత్తులో బ్లేడుతో గొంతు కోసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఇమ్రాన్‌కు తన భార్యతో చిన్నపాటి గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన అతను బ్లేడుతో గొంతు కోసుకున్నాడు. కుటుంబ సభ్యులు అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 21, 2025

23న పదో తరగతి ఫలితాలు: డీఈవో సలీం 

image

ఈనెల 23న పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదల చేస్తామని అంబేడ్కర్ కోనసీమ జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ సలీం బాష ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఫలితాలు లీప్ యాప్‌లో పాఠశాల వారీగా కూడా విడుదల చేస్తామని ఆయన వివరించారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని 110 కేంద్రాల్లో 19,217 మంది విద్యార్థులు పరీక్షలు రాసినట్లు డీఈవో తెలిపారు.

error: Content is protected !!