News May 22, 2024
OU: ఎంబీఏ (ఈవినింగ్) పరీక్ష ఫీజు స్వీకరణ

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంబీఏ (ఈవినింగ్) కోర్సు పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సు ఆరో సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్ల బ్యాక్లాగ్, ఇంప్రూవ్మెంట్ పరీక్షా ఫీజును ఈనెల 30లోగా సంబంధిత కళాశాలలో చెల్లించాలని చెప్పారు. రూ.300 అపరాధ రుసుముతో వచ్చే 6 వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఈ పరీక్షలను వచ్చే నెలలోనే నిర్వహిస్తామన్నారు.
Similar News
News February 25, 2026
ఫిల్మ్‌నగర్: సినిమా అవకాశం పేరుతో అసభ్యంగా ప్రవర్తన

సినిమాల్లో అవకాశాలంటూ యువతితో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఫిల్మ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. ఏపీకి చెందిన ఓ యువతి సినిమా అవకాశాల కోసం నగరానికి రాగా, స్నేహితురాలి ద్వారా జీఎం రవి అనే వ్యక్తి పరిచయమయ్యాడు. లుక్ టెస్ట్, స్కిన్ టెస్ట్ పేరుతో కార్యాలయానికి పిలిపించి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News February 25, 2026
రంగారెడ్డి: ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

ఇంటర్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. రంగారెడ్డిలో 200 పరీక్షా కేంద్రాలు ఉండగా.. 84,301 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు, 70,171 మంది రెండవ సంవత్సరం విద్యార్థులు ఉన్నారు. జిల్లాలో మొత్తం 1,54,472 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మాస్ కాపీయింగ్‌కు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. కేంద్రాల వద్ద BNS 163 సెక్షన్ అమల్లో ఉంది.