News August 14, 2025

OU డిగ్రీ కోర్సుల వన్‌టైమ్ ఛాన్స్ పరీక్షా తేదీలు ఖరారు

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని డిగ్రీ కోర్సుల వన్టైం పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ తదితర ఇయర్ వైజ్, సెమిస్టర్ వైజ్ కోర్సుల వన్‌టైమ్ ఛాన్స్ బ్యాక్‌లాగ్ పరీక్షలను వచ్చే నెల 9 నుంచి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.inలో చూడొచ్చన్నారు.

Similar News

News August 14, 2025

గోల్కొండ కోటలో అందుబాటులో స్పెషల్‌ మెడికల్‌ టీం

image

గోల్కొండ కోటలో పంద్రాగస్టు రోజున స్పెషల్‌ మెడికల్‌ టీమ్‌ను ఏర్పాటు చేస్తున్నామని గోల్కొండ ఏరియా ఆస్పత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ డా.శ్రీనివాసరావు తెలిపారు. ఎనిమిది మంది వైద్యులు, నర్సింగ్‌ సిబ్బందితో కూడిన ఈ టీం శుక్రవారం ఉదయం నుంచి ఒంటి గంట వరకు గోల్కొండ కోటలోని క్యాంప్‌లో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

News August 14, 2025

ఓయూ బీసీఏ పరీక్షా ఫీజు స్వీకరణ

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీసీఏ మేకప్ పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. బీసీఏ (సీబీసీఎస్) ఆరో సెమిస్టర్ మేకప్ పరీక్షా ఫీజును ఈ నెల 19వ తేదీలోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని చెప్పారు. ఈ పరీక్షలను ఈ నెలలోనే నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు.

News August 14, 2025

HYD: సైకాలజీ కోర్సుల పరీక్షా ఫలితాల విడుదల

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని సైకాలజీ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ఎంఫిల్ క్లినికల్ సైకాలజీ, ఎంఫిల్ రిహాబిలిటేషన్ సైకాలజీ, పీఎస్వైడీ, ప్రొఫెషనల్ డిప్లొమా ఇన్ క్లినికల్ సైకాలజీ తదితర కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు వివరించారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.inలో చూడొచ్చని సూచించారు.