News October 11, 2025

OU: హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ

image

ఓయూ పరిధిలోని హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల (బీహెచ్ఎంసీటీ, బీసీటీసీఏ) పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ఈ కోర్సుల ఆరో సెమిస్టర్ మేకప్ పరీక్షా ఫీజును ఈ నెల 22వ తేదీలోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించాలన్నారు. ఈ పరీక్షలను ఈ నెలలోనే నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు.

Similar News

News October 11, 2025

HYD: రాచకొండ పరిధిలోనే అత్యధిక నేరాలు..!

image

2023 ఏడాదికి సంబంధించి NCRB రిపోర్టు విడుదల చేసింది. TGలో నమోదైన నేరాలు 1,56,737 కాగా అత్యధికంగా రాచకొండ కమిషనరేట్ పరిధిలో 23,289, ‘సైబరాబాద్’లో 22,398 ‘హైదరాబాద్’లో 21,774 నేరాలు నమోదయ్యాయని పేర్కొంది. తాజాగా విడుదల చేసిన రిపోర్టులో అనేక విషయాలను పొందుపరిచి, కొన్ని కేసులకు సంబంధించిన కారణాలను సైతం వివరించింది.

News October 11, 2025

HYD: ఛార్జింగ్ స్టేషన్ పనిచేయడం లేదా..? ఇలా చేయండి..!

image

గ్రేటర్ HYDలో సుమారు 650 ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. అయితే కొన్నిటిలో సాంకేతిక సమస్యలు ఏర్పడడంతో పనిచేయటం లేదు. ఈ నేపథ్యంలో రెడ్కో యాప్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. REDCO APP డౌన్‌లోడ్ చేసుకుని ఛార్జింగ్ స్టేషన్లు ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా తెలుసుకోవచ్చు, ఫిర్యాదు చేయొచ్చు.

News October 11, 2025

HYD: MNJ ఆధ్వర్యంలో ‘డే కేర్’ సెంటర్లు..!

image

HYD రెడ్ హిల్స్ వద్ద ఉన్న MNJ ప్రభుత్వ క్యాన్సర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో డే కేర్ సేవలను ఇక జిల్లాల్లో అందించడానికి సిద్ధం చేసింది. ఇప్పటికే రాష్ట్రంలోని పలుచోట్ల కొనసాగుతున్నట్లు ప్రొఫెసర్లు తెలిపారు. MNJ క్యాన్సర్ ఆస్పత్రి వైద్యులు వర్చువల్ పద్ధతిలో పరీక్షిస్తున్నారు. హైదరాబాద్ నుంచి పర్యవేక్షించి, అందరికీ వైద్య సేవలు అందేలా చూస్తామన్నారు.