News December 29, 2024
OU: MBA కోర్సుల పరీక్ష ఫీజు స్వీకరణ

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంబీఏ కోర్సుల పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఎంబీఏ (సీబీసీఎస్), ఎంబీఏ (టెక్నాలజీ మేనేజ్మెంట్- డే), ఎంబీఏ (టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్) కోర్సుల మూడో సెమిస్టర్ రెగ్యులర్, ఎంబీఏ (ఈవినింగ్) అయిదో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షా ఫీజును వచ్చే నెల 4వ తేదీలోగా, రూ.300 లేట్ ఫీతో 6వ తేదీలోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని చెప్పారు.
Similar News
News October 22, 2025
హైదరాబాద్‌లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్‌లో నేడు సదర్ ఉత్సవ మేళా సందర్భంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు. ముఖ్యంగా నారాయణగూడలోని వైఎంసీఏ వద్ద ఉత్సవం జరగనున్న నేపథ్యంలో రామ్‌కోటి, లింగంపల్లి, బర్కత్పూరా, హిమాయత్‌నగర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయి. వాహనదారులు అసౌకర్యాన్ని నివారించుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
News October 22, 2025
వృద్ధులు, దివ్యాంగులకు రవాణా ఏర్పాట్లు: ఆర్వీ కర్ణన్

ఉప ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే విషయంలో 85 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులు ఆందోళన చెందొద్దని ఎన్నికల అధికారి కర్ణన్ తెలిపారు. వారిని పోలింగ్ కేంద్రం వరకు తీసుకెళ్లి, తిరిగి ఇంటికి చేర్చే బాధ్యత ఎన్నికల సంఘానిదేనని స్పష్టం చేశారు. ఈ సదుపాయం కోసం అర్హులు ఈసీ వెబ్సైట్లో https://ecinet.eci.gov.in/homepage/home తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన కోరారు.
News October 22, 2025
జూబ్లీహిల్స్ బైపోల్.. హోటళ్లకు భారీ డిమాండ్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు కేవలం 17 రోజుల ప్రచార సమయం మిగిలి ఉండటంతో రాజకీయ వేడి పెరిగింది. అభ్యర్థులు తమ ప్రచారాన్ని వేగవంతం చేస్తూ అన్ని ప్రాంతాలను కవర్ చేయడానికి ప్రణాళికలు వేస్తున్నారు. దీంతో ఇతర జిల్లాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలకు వసతి కల్పించేందుకు జూబ్లీహిల్స్‌తో పాటు చుట్టుపక్కల హోటళ్లు కిటకిటలాడుతున్నాయి. ఉప ఎన్నికల కారణంగా ఈ ప్రాంతంలో హోటల్ గదులకు డిమాండ్ అనూహ్యంగా పెరిగింది.