News December 29, 2024
OU: MBA కోర్సుల పరీక్ష ఫీజు స్వీకరణ

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంబీఏ కోర్సుల పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఎంబీఏ (సీబీసీఎస్), ఎంబీఏ (టెక్నాలజీ మేనేజ్మెంట్- డే), ఎంబీఏ (టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్) కోర్సుల మూడో సెమిస్టర్ రెగ్యులర్, ఎంబీఏ (ఈవినింగ్) అయిదో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షా ఫీజును వచ్చే నెల 4వ తేదీలోగా, రూ.300 లేట్ ఫీతో 6వ తేదీలోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని చెప్పారు.
Similar News
News November 5, 2025
KTRతో చర్చకు సిద్ధం: జూపల్లి కృష్ణారావు

కేటీఆర్‌పై మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్ర ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ పాలనలో ఒక్కో వ్యక్తిపై రూ.4 లక్షల అప్పు మోపారని, పదేళ్లు బుల్డోజర్ పాలన నడిపిందీ బీఆర్ఎస్సేనని మండిపడ్డారు. అధికారులను బెదిరిస్తున్నానన్న ఆరోపణలు నిరాధారమని, తన బాధ్యతలు మాత్రమే నిర్వర్తిస్తున్నానని చెప్పారు. అవసరమైతే దీనిపై KTRతో చర్చకు సిద్ధమని జూపల్లి సవాల్ విసిరారు. ఫేక్ సర్వేలతో ప్రజలను తప్పుదోవ పట్టించారని విమర్శించారు.
News November 5, 2025
FLASH: బీజాపూర్- HYD హైవేపై మరో యాక్సిడెంట్

మీర్జాగూడ ఘటన మరవకముందే తాజాగా బీజాపూర్-HYD జాతీయ రహదారిలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. మొయినాబాద్ మండలం తాజ్ సర్కిల్ వద్ద బుధవారం హైదరాబాద్ నుంచి చేవెళ్ల వైపు వెళ్తున్న కారు రోడ్డు ఇరుకుగా ఉండడంతో వేగంగా మర్రిచెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో నలుగురు యువకులకు గాయాలవగా మరొక యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.
News November 5, 2025
BE READY.. నగరంలో బిగ్గెస్ట్ పెట్ షో

ఈనెల 22,23 తేదీల్లో సిటీలో అతి పెద్ద పెట్ షో జరుగనుంది. నార్సింగిలోని ఓమ్ కన్వెన్షన్ ఇందుకు వేదిక కానుంది. దాపు 500 విభిన్న జాతులకు చెందిన కుక్కలు ప్రదర్శనకు రానున్నాయి. అంతేకాక వందకుపైగా పిల్లుల జాతులు, అరుదైన చేపలు అలరించనున్నాయి. ఇంకో విషయమేమంటే.. ఈ ఎగ్జిబిషన్లో పెట్స్ యాక్సెసరీస్ కూడా అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.


