News February 28, 2025

OU డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అసైన్మెంట్ గడువు పెంపు

image

OU ప్రొఫెసర్ రామ్ రెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్‌లో UG, PG విద్యార్థుల అసైన్మెంట్ గడువు మార్చి 29 వరకు పొడిగించారు. విద్యార్థులు పరీక్షా ఫీజు చెల్లించి, రసీదు జతచేసి (చేతిరాతతో రాసినవి మాత్రమే) అసైన్మెంట్‌ను సమర్పించాలి. జిరాక్స్ కాపీలు, ఫొటోకాపీలు, టైప్ చేసినవి చెల్లవు. గడువు దాటితే స్వీకరించరని అధికారులు స్పష్టం చేశారు. మొదటి గడువు తేదీ మార్చి 5గా ప్రకటించారు. తాజాగా దానిని పొడిగించారు.

Similar News

News March 1, 2025

నేను వైసీపీలోనే ఉంటాను: తోట త్రిమూర్తులు

image

AP: తాను జనసేన పార్టీలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని YCP MLC తోట త్రిమూర్తులు ఖండించారు. ఇటీవల జనసేన నేత సామినేని ఉదయభాను, త్రిమూర్తులు ఓ ఆలయంలో కలుసుకోవడంతో ఆయన పార్టీ మారుతారనే ప్రచారం ఊపందుకుంది. దీంతో తాను ఇప్పుడు వైసీపీలోనే ఉన్నానని, ఎప్పటికీ వైసీపీలోనే ఉంటానని స్పష్టం చేశారు. జగన్ నాయకత్వంలోనే కొనసాగుతానని వెల్లడించారు.

News March 1, 2025

ప.గో జిల్లా TODAY TOP HEADLINES

image

✷భీమవరంలో కన్నుల పండుగగా సోమేశ్వర స్వామి తెప్పోత్సవం ✷ పేద ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్: కేంద్ర సహాయ మంత్రి వర్మ ✷ బడ్జెట్ నిరుత్సాహపరిచేలా ఉంది: టీచర్ ఎమ్మెల్సీ గోపి మూర్తి ✷ రాయకుదురులో అగ్ని ప్రమాదం ✷ నరసాపురంలో గోవా మద్యం కేసులో నలుగురు అరెస్ట్✷ ఇరిగేషన్‌కు అధిక నిధులు: మంత్రి నిమ్మల ✷ ఆచంటలో కుంకుమ భరిణీల కోసం బారులు తీరిన జనం

News March 1, 2025

MHBD: ప్రైవేట్ కళాశాలల అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలి: PDSU

image

మహబూబాబాద్ పట్టణంలోని ప్రైవేట్ కళాశాల అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలని పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి బానోతు దేవేందర్ డిమాండ్ చేశారు. వారు మాట్లాడుతూ.. పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థుల వద్దకు ప్రైవేట్ కళాశాలల యజమాన్యం వెళ్లి విద్యార్థుల సమాచారం తీసుకొని వారి అనుమతి లేకుండా అడ్మిషన్లు చేసి ఫీజు కట్టాలని బెదిరింపులకు దిగుతున్నారని తెలిపారు. అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

error: Content is protected !!