News October 16, 2024

టెర్రరిజాన్ని బట్టే సరిహద్దుల్లో మా యాక్టివిటీస్: జైశంకర్

image

ఉగ్రవాదం, అతివాదమే సరిహద్దుల్లో యాక్టివిటీస్‌ను నిర్దేశిస్తాయని EAM జైశంకర్ అన్నారు. వాటితో వాణిజ్యం, ఇంధన సరఫరా, కనెక్టివిటీ జరగదని స్పష్టం చేశారు. ఇక UNSCలో విస్తృత ప్రాతినిధ్యం, సమ్మిళితత్వం, పారదర్శకత కోసం SCO చొరవ తీసుకోవాలని సూచించారు. సంస్కరణల వేగవంతానికి కృషి చేయాలన్నారు. ఇండస్ట్రియల్ కోఆపరేషన్ వల్లే పోటీతత్వం, లేబర్ మార్కెట్లు విస్తరిస్తాయన్నారు. MSME కొలాబరేషన్, కనెక్టివిటీ అవసరమన్నారు.

Similar News

News December 23, 2025

క్రిస్మస్ సందర్భంగా NASA స్పెషల్ విషెస్

image

ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రిస్టియన్స్ క్రిస్మస్‌ సెలబ్రేషన్స్‌కు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా వారికోసం NASA ఒక స్పెషల్ హాలిడే కార్డును SMలో పోస్ట్ చేసింది. చంద్ర ఎక్స్‌రే అబ్జర్వేటరీ, నాసా హబుల్, నాసా వెబ్ టెలీస్కోప్స్ నుంచి సేకరించిన ఇమేజె‌స్‌ను స్నోమ్యాన్, క్రిస్మస్ ట్రీ క్లస్టర్, స్నోవీ మౌంటేన్ క్లస్టర్, పార్ట్రిడ్జ్ నెబులా అని పేర్కొంటూ ట్వీట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పింది.

News December 23, 2025

ప్రమాదాల్లో పులి, చిరుత మృతి.. పవన్ కీలక ఆదేశాలు

image

AP: ఇవాళ మార్కాపురం అటవీ డివిజన్‌లో వాహనం ఢీకొని ఆడ పులి, ఆదోని రేంజ్‌లో రైలు ఢీకొని చిరుత మృతి చెందాయి. ఈ ఘటనలపై Dy.CM పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. 2 ప్రమాదాలపై విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. హాట్ స్పాట్లను గుర్తించి హెచ్చరిక బోర్డులు, రిఫ్లెక్టర్లు, సోలార్ బ్లింకర్లు ఏర్పాటు చేయాలన్నారు. అటవీ మార్గాల వెంట వాహనదారులు వేగంగా వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

News December 23, 2025

BREAKING: భారత్ ఘన విజయం

image

వైజాగ్ వేదికగా శ్రీలంక మహిళలతో జరిగిన రెండో టీ20లోనూ టీమ్ ఇండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 129 పరుగుల లక్ష్యాన్ని 11.5 ఓవర్లలోనే ఛేదించింది. షెఫాలీ వర్మ 34 బంతుల్లోనే 69*(11 ఫోర్లు, ఒక సిక్సర్), జెమీమా 26, స్మృతి 14, హర్మన్ ప్రీత్ 10 రన్స్ చేశారు. ఈ గెలుపుతో భారత్ 5 టీ20ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో ఉంది.