News March 18, 2024

దక్షిణ తెలంగాణకే తలమానికం మన అమ్రాబాద్ ఫారెస్ట్

image

నల్లమలలోని అమ్రాబాద్ అభయారణ్యం 2,163 చదరపు కిలో మీటర్ల మేర విస్తరించి ఉంది. ఇక్కడి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ దక్షిణ తెలంగాణకే తలమానికంగా నిలుస్తోంది. అడవిలో రెండు తెలుగు రాష్ట్రాలకు సరిహద్దుగా కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది. ఉమామహేశ్వర ఆలయాన్ని, మల్లెల తీర్థాన్ని పర్యాటక శాఖ కొంత అభివృద్ధి చేయగా.. వ్యూ పాయింట్, ఆక్టోపస్ వ్యూలను అటవీ శాఖ అభివృద్ధిలోకి తెచ్చింది.

Similar News

News February 11, 2026

మహబూబ్‌నగర్ జిల్లాలో 69.5% ఓటింగ్ నమోదు

image

మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 2 పురపాలికలు, 1 నగరపాలికలలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 69.05 ఓటింగ్ నమోదు అయినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. దేవరకద్రలో 85.51 శాతం ఓటింగ్, భూత్పూర్‌లో 84.58 శాతం ఓటింగ్ నమోదయ్యింది. అలాగే మహబూబ్‌నగర్ నగరపాలికలో 67.73% ఓటింగ్ నమోదు అయినట్లు పేర్కొన్నారు.

News February 11, 2026

కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేసిన ఏపీ జితేందర్ రెడ్డి

image

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం 44 డివిజన్ పంచాయితీ రాజ్ కాలనీలోని పోలింగ్ బూత్‌లో ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడం మన అందరి బాధ్యత అన్నారు. టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

News February 11, 2026

MBNR:మోడల్ స్కూల్.. అప్లై చేసుకోండి

image

మహబూబ్ నగర్(D) గండీడ్ మండలం వెన్నాచేడ్ ఆదర్శ పాఠశాలలో (మోడల్ స్కూల్) చేరెందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ రాయిస్ ఫాతిమా “Way2News” ప్రతినిధితో తెలిపారు. 6వ తరగతిలో 100 సీట్లు, 7,8,9,10 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లను దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని, https://tgms.telangana.gov.in వెబ్ సైట్‌లో ఈనెల 28లోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.SHARE IT.