News September 24, 2024

మా బౌలర్లు అహంకారులు: పాక్ మాజీ పేసర్

image

తమ దేశ బౌలర్లు తామే గొప్ప అనే భావనలో ఉంటారని పాకిస్థాన్ మాజీ పేసర్ బాసిత్ అలీ అన్నారు. అందుకే మోర్నే మోర్కెల్‌ను చిన్న చూపు చూసి పక్కనపెట్టారని మండిపడ్డారు. ‘భారత్, పాక్ ఆటగాళ్ల మైండ్ సెట్ వేరు. పాక్‌ను వైట్ వాష్ చేసిన బంగ్లాదేశ్‌ను టీమ్ ఇండియా చిత్తు చేసింది. పాక్ ఒత్తిడికి గురైంది. భారత్ కాలేదు. మోర్కెల్ కోచింగ్‌ను టీమ్ ఇండియా బౌలర్లు ఆస్వాదిస్తున్నారు’ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News September 24, 2024

సీఎం రాజీనామా చేసే ప్రసక్తే లేదు: డిప్యూటీ సీఎం

image

<<14181565>>ముడా స్కామ్‌<<>>లో విచారణ ఎదుర్కోబోతున్న కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు తన డిప్యూటీ డీకే శివకుమార్ అండగా నిలిచారు. హైకోర్టు తీర్పు ఆయనకు ఎదురుదెబ్బేమీ కాదన్నారు. ‘సీఎం రిజైన్ చేసే ప్రసక్తే లేదు. ఆయన ఎలాంటి తప్పు, స్కామ్ చేయలేదు. మాపై, దేశంలోని అపోజిషన్ లీడర్లపై బీజేపీ చేస్తున్న రాజకీయ కుట్ర ఇది. గతంలోనూ మేం వీటిని ఎదుర్కొన్నాం. నేను స్వచ్ఛంగా వచ్చానా లేదా? చట్టాన్ని గౌరవించి మేం పోరాడతాం’ అని అన్నారు.

News September 24, 2024

లడ్డూలో పొగాకు పొట్లం వార్తలను ఖండించిన TTD

image

తిరుమల శ్రీవారి లడ్డూలో పొగాకు పొట్లం ఉన్నట్లు వస్తోన్న <<14180009>>ఆరోపణలను<<>> టీటీడీ కొట్టిపారేసింది. ‘పోటులో శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు అత్యంత భక్తిశ్రద్ధలతో, నియమ నిష్ఠలతో, శ్రీవారి లడ్డూలను ప్రతిరోజు లక్షలాదిగా తయారు చేస్తారు. ఈ లడ్డూల తయారీ కూడా సీసీటీవీల పర్యవేక్షణలో ఉంటుంది. ఇంతటి పకడ్బందీగా ఉన్న వ్యవస్థలో పొగాకు ఉన్నట్లు ప్రచారం చేయడం శోచనీయం’ అని ప్రకటన విడుదల చేసింది.

News September 24, 2024

స్టార్ హీరోలు రెమ్యునరేషన్ తగ్గించుకోవాలి: వెట్రిమారన్

image

సినిమా ఇండస్ట్రీ గట్టెక్కాలంటే స్టార్ హీరోలు తమ రెమ్యునరేషన్ తగ్గించుకోవాలని తమిళ డైరెక్టర్ వెట్రిమారన్ సూచించారు. కరోనా తర్వాత థియేటర్లు ఆర్థిక ఒడిదొడుకులకు గురయ్యాయని తెలిపారు. కొన్ని ఓటీటీ వేదికలు స్టార్ హీరోల సినిమాల కోసం భారీ మొత్తాలు చెల్లించడం వల్ల పరిశ్రమలో అసమతుల్యత ఏర్పడిందన్నారు. దీని వల్ల హీరోలు రెమ్యునరేషన్ పెంచారని, తద్వారా సినిమాల బడ్జెట్ కూడా పెరుగుతోందని వివరించారు.