News November 14, 2024
BGTలో మా బౌలర్లదే పైచేయి: హాడిన్

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా పేస్ బౌలింగ్ ముందు భారత బ్యాటర్లు నిలవలేరని ఆసీస్ మాజీ క్రికెటర్ బ్రాడ్ హాడిన్ అన్నారు. తొలి టెస్ట్ జరిగే పెర్త్‌లో ఓపెనింగ్ బ్యాటర్లకు చాలా కష్టంగా ఉంటుందని తెలిపారు. IND ఓపెనర్ జైస్వాల్ చాలా మంచి బ్యాటర్ అని, కానీ AUSలో ఆడిన అనుభవం లేదని పేర్కొన్నారు. బౌన్స్‌ను అతను ఎలా హ్యాండిల్ చేస్తారో ఇప్పుడే చెప్పలేమని ఓ పాడ్‌కాస్ట్‌లో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
Similar News
News December 2, 2025
టెన్త్ పరీక్షలు ఎప్పుడంటే?

TG: టెన్త్ పరీక్షలు 2026 మార్చి 16న నిర్వహించేందుకు SSC బోర్డు సిద్ధమైంది. మార్చి 13తో ఇంటర్ ఎగ్జామ్స్ ముగియనున్న నేపథ్యంలో వెంటనే వీటిని నిర్వహించేలా అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. మరోవైపు విద్యార్థులపై ఒత్తిడి పడకుండా ఒక్కో పేపర్‌కు మధ్య 1-2 రోజులు గ్యాప్ ఉండేలా ప్లాన్ చేశారు. ఒకవేళ MAR 16న పరీక్షలు మొదలైతే ఏప్రిల్ మొదటి వారంలో ముగియనున్నాయి. ఒకటి రెండు రోజుల్లో షెడ్యూల్ రానుంది.
News December 2, 2025
ప్రాణాలతో ఉండాలంటే దేశం నుంచి వెళ్లిపో: ట్రంప్

పదవి నుంచి దిగిపోయి, దేశం విడిచి వెళ్లిపోవాలని వెనిజుల అధ్యక్షుడు నికోలస్ మదురోకు US అధ్యక్షుడు ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు. అలా చేస్తే ఆయన్ను, సన్నిహితులను ప్రాణాలతో వదిలేస్తామని చెప్పారు. ఫోన్ సంభాషణ సందర్భంగా ట్రంప్ హెచ్చరించారని ‘మియామి హెరాల్డ్’ చెప్పింది. ఈ ప్రతిపాదనకు ఆయన ఒప్పుకోలేదని తెలిపింది. ‘సార్వభౌమాధికారం, స్వేచ్ఛతో కూడిన శాంతి కావాలి. బానిస శాంతి కాదు’ అని మదురో చెప్పడం గమనార్హం.
News December 2, 2025
సుడిదోమ, పచ్చదోమ కట్టడికి లైట్ ట్రాప్స్

కొన్ని రకాల పురుగులు పంటలకు రాత్రి పూట కూడా హాని చేస్తుంటాయి. ఇలాంటి కీటకాలు రాత్రివేళ లైట్ కాంతికి బాగా ఆకర్షించబడతాయి. ఇలాంటి కీటకాలను ఆకర్షించి అంతచేసేవే ‘లైట్ ట్రాప్స్’. ముఖ్యంగా వరిలో సుడిదోమ, పచ్చదోమ నివారణకు ఈ లైట్ ట్రాప్స్ బాగా పనిచేస్తాయి. లైట్‌తో పాటు ఒక టబ్‌లో నీటిని పోసి దానిలో రసాయన మందును కలిపితే పురుగులు లైట్‌కి ఆకర్షించబడి మందు కలిపిన నీళ్లలో పడి చనిపోతాయి.


