News January 30, 2025

మా కార్పొరేటర్లను పశువుల్లా కొంటున్నారు: అంబటి

image

AP: YCP కార్పొరేటర్లను TDP MLAలు కొంటున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. ‘మున్సిపల్ ఎన్నికల్లో గెలవడానికి పశువుల్లా కొనుగోలు చేసి కేంద్రమంత్రి పెమ్మసాని కండువాలు కప్పుతున్నారు. ఆయన కొంచెం తగ్గించుకుంటే మంచిది. కార్పొరేటర్ల చుట్టూ MLAలు తిరుగుతున్నారు’ అని ఆరోపించారు. FEB 3న వివిధ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఖాళీగా ఉన్న ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్​‌పర్సన్, Dy.మేయర్ల ఎన్నికలు జరగనున్నాయి.

Similar News

News November 26, 2025

సమాచార హక్కు చట్టం పారదర్శకంగా అమలు చేయాలి: ఆర్టీఐ కమిషనర్

image

సమాచార హక్కు చట్టం పారదర్శకంగా అమలు కావాలని ఆర్టీఐ కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి అధికారులను సూచించారు. బుధవారం సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించి, అధికారులు భయపడకుండా ప్రజలకు సమాచారం అందించాలన్నారు. అన్ని శాఖల్లో రిజిస్టర్ నిర్వహణ చేయాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి సూచించారు.

News November 26, 2025

2 కోట్ల ఆధార్ ఐడీల తొలగింపు.. కారణమిదే!

image

దేశవ్యాప్తంగా 2 కోట్ల ఆధార్ ఐడీలను UIDAI డీయాక్టివేట్ చేసిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. డేటా క్లీనింగ్‌లో భాగంగా చనిపోయిన వ్యక్తుల వివరాలను డిసేబుల్ చేసినట్లు చెప్పింది. ఆధార్ దుర్వినియోగాన్ని నిరోధించేందుకు ఇలా చేసినట్లు పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వ శాఖలు, భారత రిజిస్ట్రార్ జనరల్ నుంచి వచ్చిన డెత్ రిజిస్ట్రేషన్లు, ఇతర సమాచారం ఆధారంగా డీయాక్టివేట్ చేసినట్లు వెల్లడించింది.

News November 26, 2025

బాలిస్టిక్ క్షిపణి పరీక్షించిన పాకిస్థాన్

image

యాంటీ షిప్ బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినట్లు పాకిస్థాన్ మిలిటరీ ప్రకటించింది. ‘స్థానికంగా నిర్మించిన నేవల్ ప్లాట్‌ఫామ్ నుంచి మిస్సైల్ పరీక్షించాం. సముద్రం, భూమిపై ఉన్న లక్ష్యాలను ఇది అత్యంత కచ్చితత్వంతో ఛేదించగలదు. ఇందులో అత్యాధునిక గైడెన్స్ వ్యవస్థలు ఉన్నాయి’ అని పేర్కొంది. కాగా మే నెలలో భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ తర్వాతి నుంచి పాకిస్థాన్ ఈ తరహా ప్రయోగాలను పెంచింది.