News December 19, 2024
మా డ్రీమ్ ఐకాన్ ఆశీర్వాదం లభించింది: కీర్తి

స్టార్ హీరోయిన్ పెళ్లికి ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు హాజరవడం కామన్. కానీ, కీర్తి సురేశ్ వివాహానికి దళపతి విజయ్ మాత్రమే వచ్చారు. విజయ్‌కు కీర్తి పెద్ద అభిమాని కావడమే ఇందుకు కారణం. కీర్తి కోరిక మేరకు ఆయన హాజరైనట్లు తెలుస్తోంది. తాజాగా విజయ్‌తో దిగిన ఫొటోను కీర్తి షేర్ చేశారు. పెళ్లిలో తమ డ్రీమ్ ఐకాన్ నుంచి ఆశీర్వాదం లభించిందంటూ విజయ్ పట్ల తనకున్న అభిమానాన్ని తెలియజేశారు. ఈ ఫొటోలు వైరలవుతున్నాయి.
Similar News
News December 5, 2025
పంచాయతీ ఎన్నికలు.. తొలి విడతలో 395 స్థానాలు ఏకగ్రీవం

TG: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 4,236 సర్పంచ్ స్థానాలకు గాను 395 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో అత్యధికంగా వికారాబాద్ జిల్లాలో 39 స్థానాలు ఉన్నాయి. అటు సీఎం రేవంత్ నియోజకవర్గం కొడంగల్‌లో 26 గ్రామాలు ఏకగ్రీవం అయ్యాయి. ఓవరాల్‌గా 5 గ్రామాల్లో నామినేషన్లు దాఖలవ్వలేదు. మిగిలిన 3,836 స్థానాలకు ఈ నెల 11న పోలింగ్ జరగనుంది. కాగా మూడో విడత ఎన్నికల నామినేషన్ గడువు నేటితో ముగియనుంది.
News December 5, 2025
రైతన్నా.. ఈ పురుగుతో జాగ్రత్త

ఖరీఫ్ పంట కోతలు, రబీ పంట నాట్ల వేళ ఏపీ వ్యాప్తంగా 800కు పైగా స్క్రబ్‌టైఫస్ కేసులు నమోదవ్వడం కలవరపెడుతోంది. చిగ్గర్ అనే పురుగు కాటుకు గురైనవారు తీవ్రజ్వరం, ఒంటి నొప్పులు, వాంతులు, విరేచనాలతో ఆస్పత్రిపాలవుతున్నారు. పొలాలు, అడవులు, తడి నేల, పశువుల మేత ప్రాంతాల్లో పని చేసేవారికి ఈ పురుగుకాటు ముప్పు ఎక్కువగా ఉంది. స్క్రబ్ టైఫస్ లక్షణాలు, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News December 5, 2025
రో-కో భవిష్యత్తును వారు నిర్ణయించడం దురదృష్టకరం: హర్భజన్

తమ కెరీర్‌లో పెద్దగా ఏం సాధించని వారు రోహిత్, కోహ్లీ భవిష్యత్తును నిర్ణయిస్తుండటం దురదృష్టకరమని భారత మాజీ క్రికెటర్ హర్భజన్ వ్యాఖ్యానించారు. తనతో పాటు తన సహచరులకు ఇలాంటి పరిస్థితే ఎదురైందని చెప్పారు. రోహిత్, కోహ్లీ నిరంతరం పరుగులు చేస్తూ బలంగా ముందుకు సాగుతున్నారన్నారు. AUS సిరీస్‌కు ముందు నుంచే కోచ్ గంభీర్‌తో ‘రో-కో’కు పడట్లేదన్న పుకార్ల నడుమ భజ్జీ వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి.


