News May 13, 2024

మా కర్తవ్యం పూర్తయింది.. మరి మీది?: రాజమౌళి

image

దర్శక ధీరుడు రాజమౌళి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఆయన తన భార్య రమతో కలిసి నేరుగా HYDలోని షేక్‌పేట్ ఇంటర్నేషనల్ స్కూల్‌లోని పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటు వేసినట్లు ట్వీట్ చేశారు. ‘నా కర్తవ్యం పూర్తయింది. మీరు ఓటు వేశారా?’ అని ప్రశ్నించారు. మరోవైపు ఏపీ బీజేపీ చీఫ్ పురందీశ్వరి రాజమండ్రిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Similar News

News March 16, 2026

ఆస్కార్-2026 విజేతలు..

image

*ఉత్తమ సహాయ నటి – ఎమీ మ్యాడిగన్(వెపన్స్)
*బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ – కెపాప్ డిమోన్ హంటర్స్ (మ్యాగీ కాంగ్, క్రిస్ అపెల్హాన్స్, మిషెల్లీ వాంగ్)
*బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ – ది గర్ల్ హూ క్రైడ్ పర్ల్స్(క్రిస్ లావిస్, మసీక్ జెజెర్బోవ్‌స్కీ)
*బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ – కేట్ హాలే(ఫ్రాంకెన్‌స్టైన్)
*మేకప్ & హెయిర్ స్టైల్ – మైక్ హిల్, జోర్డాన్ శామ్యూల్, క్లియోనా ఫ్యురే (ఫ్రాంకెన్‌స్టైన్)

News March 16, 2026

నేటి నుంచి ఏపీలో పది పరీక్షలు.. ఇవి చూసుకోండి

image

APలో టెన్త్ పరీక్షలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. ఉ.9.30-మ.12.45 వరకు ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. ఈ ఏడాది 6,40,916 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో 10AM వరకు అనుమతిస్తారు. OMR షీట్‌పై ఫొటో, పేరు, నంబరును తప్పకుండా సరిచూసుకోవాలి. 24 పేజీల బుక్‌లెట్‌లో జవాబులు రాశాక అవసరమైతే మరో 12 పేజీల బుక్‌లెట్ ఇస్తారు. బ్లూ, బ్లాక్ పాయింట్ పెన్నులకు మాత్రమే అనుమతి ఉంటుంది.#ALL THE BEST

News March 16, 2026

ఈ తప్పులతో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి!

image

ఏమీ తినకున్నా కొన్నిసార్లు బాడీలో షుగర్ లెవెల్స్ పెరుగుతుంటాయి. దీనికి 4 కారణాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. నిద్రలేమి, ఒత్తిడి, ఫుడ్ స్కిప్ చేయడం, లేవగానే కాఫీ తాగడం వల్ల అసాధారణంగా షుగర్ పెరగొచ్చని హెచ్చరిస్తున్నారు. డయాబెటిస్ ఉన్న వారికి ఇది హానికరమని అంటున్నారు. ‘రోజూ 7-8గంటలు నిద్రపోవాలి. మెడిటేషన్, యోగా చేయాలి. సమయానికి తినాలి. ఖాళీ కడుపుతో కెఫీన్ పదార్థాలు తాగొద్దు’ అని సూచిస్తున్నారు.