News September 15, 2024

మా ఆర్థిక కష్టాలు తాత్కాలికమే: మాల్దీవులు

image

తమ ఆర్థిక కష్టాలు తాత్కాలికమేనని మాల్దీవుల ఆర్థిక మంత్రి మూసా జమీర్ తాజాగా పేర్కొన్నారు. చైనాకు దగ్గరయ్యాక ఆ దేశం అప్పుల ఊబిలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. బయటపడేందుకు అంతర్జాతీయ ద్రవ్యనిధి(IMF) ప్యాకేజీకి మాల్దీవులు యత్నిస్తోందంటూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తమ అవసరాలకు, పరిస్థితులకు తగ్గట్టుగా స్పందించే మిత్రదేశాలు తమకున్నాయని, IMF గురించి ఆలోచించడం లేదని మూసా స్పష్టం చేశారు.

Similar News

News September 18, 2024

భారత్‌లో ధనిక, పేద రాష్ట్రాలివే!

image

భారత్‌లోని ధనిక, పేద రాష్ట్రాల జాబితాను ప్రధానమంత్రి ఆర్థిక సలహామండలి(PMEAC) తాజాగా విడుదల చేసింది. దాని ప్రకారం.. ఢిల్లీ, తెలంగాణ, కర్ణాటక, హరియాణా, తమిళనాడు దేశంలో తొలి ఐదు ధనిక రాష్ట్రాలుగా నిలిచాయి. ఇక బిహార్, ఝార్ఖండ్, యూపీ, మణిపుర్, అస్సాం రాష్ట్రాలు తొలి ఐదు పేద రాష్ట్రాలుగా ఉన్నాయి. రాష్ట్రాల GDP ప్రామాణికంగా ఈ జాబితాను రూపొందించింది.

News September 18, 2024

మెగాఫ్యాన్స్ రెడీ అయిపోండి: తమన్

image

రామ్‌చరణ్ ‘గేమ్‌ఛేంజర్’ అప్‌డేట్స్ సరిగ్గా లేకపోవడం పట్ల మెగాభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. వారందరికీ ఆ సినిమా సంగీత దర్శకుడు తమన్ గుడ్ న్యూస్ చెప్పారు. ‘గేమ్‌ఛేంజర్‌ ఈవెంట్లకు వచ్చేవారం నుంచి అడ్డూఆపూ ఉండదు. డిసెంబరు 20న విడుదలయ్యే వరకు వెల్లువలా అప్‌డేట్స్ వస్తాయి’ అని ట్వీట్ చేశారు. దీంతో త్వరగా అప్‌డేట్స్ ఇస్తే బ్రేక్ ఇస్తామంటూ చరణ్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

News September 18, 2024

రోహిత్ అంటే సహచరులకు చాలా గౌరవం: గంభీర్

image

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ పట్ల సహచరులు అత్యంత గౌరవంగా వ్యవహరిస్తారని జట్టు కోచ్ గంభీర్ తెలిపారు. అతడి నాయకత్వంతో ఆ గౌరవాన్ని సంపాదించుకున్నారని పేర్కొన్నారు. ‘సిబ్బంది ఎంతమంది ఉన్నా జట్టు అనేది కెప్టెన్‌దే. అతడే ముందుండి నడిపించాలి. జట్టు సభ్యులందరితోనూ రోహిత్‌ బంధం బాగుంటుంది. నేను ఆడుతున్న రోజుల్లో మా ఇద్దరి మధ్య స్నేహం కూడా అద్భుతంగా ఉండేది. అతనో గొప్ప వ్యక్తి’ అని కొనియాడారు.