News August 8, 2024
వారి తప్పులను సరిదిద్దేందుకే మా ప్రయత్నం: సీతక్క

TG: గ్రామ పంచాయతీలను బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో రకాలుగా భ్రష్టు పట్టించిందని మంత్రి సీతక్క మండిపడ్డారు. గ్రామపంచాయతీలకు రూ.10,170 కోట్లు కేటాయించి రూ.5,988 కోట్లనే రిలీజ్ చేసిందని మీడియాతో చెప్పారు. మిగిలినవి పెండింగ్లో పెట్టిందన్నారు. BRS ప్రభుత్వ తప్పులను సరిదిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. ‘స్వచ్ఛదనం-పచ్చదనం’ కార్యక్రమంపై హరీశ్ రావు విమర్శలు మానుకోవాలని హితవు పలికారు.
Similar News
News January 3, 2026
నేడు అంజన్న దర్శనానికి పవన్ కళ్యాణ్

ఏపీ Dy.CM పవన్ కళ్యాణ్ ఇవాళ TGలోని కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోనున్నారు. అక్కడ రూ.35.19కోట్ల TTD నిధులతో నిర్మించనున్న దీక్ష విరమణ మండపం, సత్రంకు శంకుస్థాపన చేస్తారు. 10.30am-11.30am మధ్య ఈ కార్యక్రమాలు ఉంటాయని జనసేన పార్టీ తెలిపింది. ఒకేసారి 2,000 మంది దీక్ష విరమణ చేసేలా మండపాన్ని నిర్మించనున్నారు. సత్రంలో 96 విశ్రాంతి గదులు ఉండనున్నాయి.
News January 3, 2026
దావోస్, యూఎస్ పర్యటనకు సీఎం రేవంత్!

TG: పెట్టుబడుల సమీకరణ కోసం సీఎం రేవంత్ ఈ నెల 19న స్విట్జర్లాండ్లోని దావోస్లో పర్యటించనున్నారు. ప్రతి ఏడాదిలాగే ఈసారీ అక్కడ జరిగే పెట్టుబడుల సదస్సులో ఆయన పాల్గొననున్నారు. అనంతరం అమెరికా పర్యటనకు వెళ్తారని సమాచారం. ఈ టూర్ షెడ్యూల్ ఖరారు కావాల్సి ఉంది. ఇది ఫిక్స్ అయితే ఆయన ఫిబ్రవరి 1న హైదరాబాద్ తిరిగి వస్తారని సమాచారం.
News January 3, 2026
నవగ్రహ ప్రదక్షిణలో పఠించాల్సిన మంత్రం

“ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయచ
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ:”
నవగ్రహ ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ మంత్రాన్ని పఠిస్తే.. మనసు ఏకాగ్రతతో నిండి, గ్రహాల అనుగ్రహం వేగంగా లభిస్తుంది. సూర్యుడు మొదలుకొని కేతువు వరకు తొమ్మిది గ్రహాలను స్మరిస్తూ చేసే ఈ ప్రార్థన జాతక దోషాలను హరిస్తుంది. మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది. అలాగే గ్రహ గతులు అనుకూలించి, ఆయురారోగ్య ఐశ్వర్యాలు లభిస్తాయని శాస్త్రం చెబుతోంది.


