News March 25, 2025

ఏప్రిల్‌లో ‘మన ఇంటికి మన మిత్ర’

image

AP: వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌పై అవ‌గాహ‌న క‌ల్పించడానికి APRలో ‘ప్ర‌తి ఇంటికి మ‌న‌మిత్ర’ కార్య‌క్ర‌మాన్ని ప్రభుత్వం నిర్వహించనుంది. అధికారులు ప్రతి ఇంటికీ వెళ్లి స్మార్ట్‌ఫోన్లలో 9552300009 నంబర్‌ను సేవ్ చేసి సేవల గురించి వివరిస్తారని IT&RTG శాఖ కార్య‌ద‌ర్శి భాస్క‌ర్ వెల్ల‌డించారు. ప్రస్తుతం 210 సేవలు అందుతున్నాయని చెప్పారు. అన్ని రకాల ధ్రువపత్రాలను వాట్సాప్‌లోనే అందిస్తామని తెలిపారు.

Similar News

News November 29, 2025

NZB: కల్లు ఉద్దెర ఇవ్వనందుకు దాడి.. ఏడేళ్ల జైలు శిక్ష

image

కల్లు ఉద్దెర ఇవ్వనందుకు సీసాతో దాడి చేసిన నిందితుడికి ఏడేళ్ల జైలు విధించారని NZB రూరల్ SHO శ్రీనివాస్ తెలిపారు. 2020 Oct 12న రాంనగర్ కల్లు బట్టీలో పని చేస్తున్న పున్నమోళ్ల రాజేష్ గౌడ్‌ను కల్లు ఉద్దెర ఇవ్వలేదని నెహ్రూ నగర్‌కు చెందిన షేక్ హైమద్ పగిలిన కల్లు సీసాతో తీవ్రంగా గాయపరిచాడని చెప్పారు. నేరం నిరూపణ కావడంతో హైమద్‌కు 7 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ అడిషనల్ సెషన్స్ జడ్జి సాయి సుధ తీర్పు చెప్పారు.

News November 29, 2025

TODAY HEADLINES

image

➢ గోవాలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన(77 ఫీట్) రాముని విగ్రహాన్ని ఆవిష్కరించిన పీఎం మోదీ
➢ జనవరి 1న అందరం లొంగిపోతాం: మావోయిస్టు పార్టీ
➢ 2028 మార్చికి అమరావతి నిర్మాణం పూర్తి: CM CBN
➢ అమరావతిలో 15 బ్యాంకులకు ఒకేసారి శంకుస్థాపన
➢ దూసుకొస్తున్న ‘దిత్వా’ తుఫాన్.. కోస్తా, రాయలసీమకు భారీ వర్ష సూచన
➢ TGలో పంచాయతీ ఎన్నికలపై స్టేకు హైకోర్టు నిరాకరణ
➢ కాళేశ్వరంతో ఒక్క ఎకరానికీ నీళ్లు రాలేదు: కవిత

News November 29, 2025

మావోయిస్ట్ కీలక నేత అనంత్ అస్త్ర సన్యాసం

image

మావోయిస్టు పార్టీ కీలక నేతల లొంగుబాటు పర్వం కొనసాగుతోంది. తాజాగా మహారాష్ట్ర – మధ్యప్రదేశ్ – ఛత్తీస్‌గఢ్ స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి అనంత్ అలియాస్ వికాస్ మహారాష్ట్ర పోలీసుల ఎదుట లొంగిపోయారు. మొత్తం 15 మంది నక్సల్స్ అస్త్ర సన్యాసం తీసుకున్నారు. వీరిలో ఐదుగురు మహిళలు ఉన్నారు. జనవరి 1న సాయుధ విరమణ చేస్తున్నట్టు నిన్న లేఖ విడుదల చేసిన అనంత్ అంతలోనే లొంగిపోవడం గమనార్హం.