News June 27, 2024
మా ప్రభుత్వం ₹12,922 కోట్ల అప్పు తీర్చింది: టీ కాంగ్రెస్

CMగా KCR పదేళ్ల కాలంలో ₹7లక్షల కోట్ల అప్పులు చేశారని T కాంగ్రెస్ ట్వీట్ చేసింది. వాటిపై వడ్డీలు కట్టడానికే ప్రస్తుత ప్రభుత్వం కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొంది. ‘2014లో అప్పు ₹62వేల కోట్లు. KCR దిగిపోయే నాటికి ₹7లక్షల కోట్లకు చేరింది. 2023 DEC 7 నుంచి 2024 JUNE 17 వరకు మా ప్రభుత్వం ₹25,118cr అప్పు తెచ్చింది. ₹38,040cr అప్పు తిరిగి కట్టింది. అంటే ₹12,922cr అప్పు తీర్చింది’ అని తెలిపింది.
Similar News
News April 11, 2026
రేపు ఉ.11 గంటలకు ఇంటర్ ఫలితాలు

తెలంగాణ ఇంటర్ ఫలితాలను రేపు ఉ.11 గంటలకు విడుదల చేయనున్నట్లు బోర్డు వెల్లడించింది. హైదరాబాద్‌లోని TGBIE భవనంలో జరిగే ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, ఉన్నతాధికారులు పాల్గొంటారని తెలిపింది.
* రేపు ఒక్క క్లిక్‌తో అందరి కంటే వేగంగా Way2Newsలో రిజల్ట్స్‌ను తెలుసుకోండి.
News April 11, 2026
మా ‘స్వీటెస్ట్’ ఆయిల్ కొనేందుకు పోటెత్తుతున్నారు: ట్రంప్

అమెరికన్ క్రూడ్ ఆయిల్ కొనేందుకు భారీ ట్యాంకర్లు తరలివస్తున్నాయని ట్రంప్ అన్నారు. వీటికి ఆయిల్ సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సౌదీ, రష్యాల కంటే తమ వద్ద ఎక్కువ నిల్వలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. US క్రూడ్ ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైనదన్న ట్రంప్.. ఇది స్వీటెస్ట్ ఆయిల్ అని పేర్కొన్నారు. హార్ముజ్ రీఓపెనింగ్‌పై పాక్‌లో ఇరాన్-US మధ్య చర్చలు జరగనున్న వేళ ట్రంప్ ఈ పోస్ట్ చేయడం చర్చనీయాంశమైంది.
News April 11, 2026
మృతుడి ‘ఆధార్’ను డీయాక్టివేట్ ఎలా చేయాలి?

ఎవరైనా చనిపోయాక వారి ఆధార్‌ను డీయాక్టివేట్ చేయడం ముఖ్యం. లేదంటే ఆ నంబర్ ఆధారంగా దుండగులు సైబర్ నేరాలకు పాల్పడే అవకాశం ఉంది.
✒ https://myaadhaar.uidai.gov.in/లోకి వెళ్లి కుటుంబీకుల్లోని ఒకరి ఆధార్‌తో లాగిన్ అవ్వాలి.
✒ ‘రిపోర్ట్ డెత్ ఆఫ్ ఎ ఫ్యామిలీ నంబర్’ ఆప్షన్‌ను ఎంచుకొని మృతుడి వివరాలు నమోదు చేయాలి.
✒ డెత్ రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఎంటర్ చేసి, సర్టిఫికెట్‌ను అప్‌లోడ్ చేస్తే సరిపోతుంది.
#ShareIt


