News April 13, 2024

మా ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేయదు: మంత్రి శ్రీధర్ బాబు

image

TG: ఫోన్ ట్యాపింగ్ వివాదం నేపథ్యంలో మంత్రి శ్రీధర్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేయదన్నారు. అలాంటి సంస్కృతి తమది కాదన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పోటీయే కాదని.. 12 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కొనసాగుతోందని.. ఇందులో ఎవరున్నా బయటకు వస్తారని తెలిపారు.

Similar News

News March 31, 2026

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ₹100కోట్ల మార్క్ చేరుతుందా?

image

బాక్సాఫీసు కలెక్షన్లు తగ్గుతుండటంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వంద కోట్ల క్లబ్‌లోకి ఎంటర్ అవుతుందా? లేదా? అనేది చర్చనీయాంశమైంది. ఉగాదికి (మార్చి 19) రిలీజైన ఈ సినిమా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ₹94.38కోట్ల గ్రాస్ నమోదు చేసింది. ఇక భారత్‌లో ఈ మూవీ నెట్ కలెక్షన్లు ₹70.29Crకు చేరాయి. రోజు రోజుకూ ఆక్యుపెన్సీ తగ్గుతుండటంతో ఈ సినిమా వంద కోట్ల మార్క్ అందుకోవడం కష్టమేనని సినీ వర్గాలు చెబుతున్నాయి.

News March 31, 2026

కరెంట్ అఫైర్స్

image

* పారాలింపిక్ మెడలిస్ట్ షీతల్ దేవికి ‘పారా ఆర్చర్ ఆఫ్ ది ఇయర్ 2025’ పురస్కారం
* తెలంగాణ అసెంబ్లీలో గిగ్ వర్కర్స్ బిల్లు, అడ్వకేట్స్ ప్రొటెక్షన్ బిల్లు సహా పది బిల్లులకు ఆమోదం
* బిహార్ సీఎంగా నితీశ్ కుమార్ రాజీనామా
* జీవితకాల కనిష్ఠాన్ని (₹95.12) తాకిన రూపాయి విలువ
* ₹3.24లక్షల కోట్ల బడ్జెట్‌కు తెలంగాణ అసెంబ్లీలో ఆమోదం
* PMAY, టిడ్కో స్కిమ్ కింద మరో 2.50లక్షల ఇళ్లను పంపిణీ చేసిన ఏపీ ప్రభుత్వం

News March 31, 2026

ఆందోళన వద్దు.. రూపాయి బానే ఉంది: నిర్మల

image

రూపాయి <<19515449>>పతనంపై<<>> ఆందోళన అక్కర్లేదని పార్లమెంటులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి మార్చి 27 నాటికి రూపాయి 4.1% పడిపోయిందని తెలిపారు. అయితే సౌత్ కొరియన్ వాన్ (4.6%), థాయ్ భట్ (5.5%), ఫిలిప్పైన్ పెసో (4.8%) మొదలైన కరెన్సీలు ఇంతకన్నా ఎక్కువ క్షీణించాయన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని.. ఆర్థికలోటును అదుపులో ఉంచడంపై భారత్‌కు ప్రశంసలు దక్కుతున్నాయన్నారు.