News November 24, 2024
మా ఇల్లు బఫర్ జోన్లో లేదు: హైడ్రా కమిషనర్

HYD మధురానగర్లోని తన ఇల్లు బఫర్ జోన్లో లేదని, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. 44ఏళ్ల కిందట తన తండ్రి నిర్మించిన ఇంట్లోనే ఉంటున్నామన్నారు. ఒకప్పటి పెద్ద చెరువునే 25 ఏళ్ల క్రితం కృష్ణకాంత్ పార్కుగా మార్చారని చెప్పారు. ఆ పార్క్కు తమ ఇంటికి మధ్య కి.మీ. దూరం ఉందని వివరించారు. చెరువు కట్ట దిగువన 10 మీటర్లు దాటితే బఫర్ జోన్ పరిధిలోకి రాదన్నారు.
Similar News
News November 17, 2025
‘ఆపరేషన్ సిందూర్’లో కాలు కోల్పోయిన ఆవుకు కొత్త జీవితం

‘ఆపరేషన్ సిందూర్’లో కాలు కోల్పోయిన ఆవుకు పశువైద్యులు కొత్త జీవితాన్ని ఇచ్చారు. జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్థాన్ జరిపిన షెల్లింగ్లో గౌరి అనే ఆవు కాలు కోల్పోయింది. దీంతో దానికి దేశీయంగా తయారు చేసిన ‘కృష్ణ లింబ్’ అనే కృత్రిమ కాలుని అమర్చారు. దీంతో అది మునుపటిలా నడుస్తోంది. డాక్టర్ తపేశ్ మాథుర్ దీన్ని రూపొందించారు. అవసరమైన జంతువుల యజమానులకు వాటిని ఉచితంగా అందిస్తున్నారు.
News November 17, 2025
మోక్ష మార్గాన్ని చూపే విష్ణు శ్లోకం

ఏష మే సర్వధర్మాణాం ధర్మో ధిక తమోమతః|
యద్భక్త్యా పుణ్డరీకాక్షం స్తవైరర్చేన్నరస్సదా||
‘పద్మముల వంటి కన్నులు గల విష్ణువును ఎవరైతే భక్తితో, స్తోత్రములతో ఆరాధిస్తారో.. అదే అన్ని ధర్మముల కంటే గొప్పదైనది’ అని ఈ శ్లోకం చెబుతోంది. ఇతర కర్మలు, వ్రతాలు, ఆచారాల కంటే దేవుడి పట్ల నిష్కల్మషమైన ఆరాధన, కీర్తన అత్యంత ముఖ్యమైనది, ఉత్తమమైనది. శుద్ధమైన భక్తి భావమే మనకు మోక్ష మార్గాన్ని చూపుతుంది. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>
News November 17, 2025
గర్భ నిరోధక ఇంజెక్షన్ గురించి తెలుసా?

పిల్లలు పుట్టకుండా ఉండేందుకు అనేక పద్ధతులు పాటిస్తారు. అయితే కొన్నిసార్లు వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. వీటికి ప్రత్యామ్నాయమే ఈ ఇంజెక్షన్. దీన్ని డిపోమెట్రోక్సీ ప్రొజెస్టెరాన్ అసిటేట్ (DMPA) ఇంజెక్షన్ అంటారు. 3నెలల పాటు గర్భం రాకుండా మహిళలు ఈ ఇంజెక్షన్ వాడొచ్చు. తర్వాత నెల విరామంతో మరో ఇంజెక్షన్ తీసుకోవాలి. దీనివల్ల రోజూ గర్భనిరోధక మాత్ర వేసుకోవాల్సిన అవసరం ఉండదు.


