News September 25, 2024

ధర్మాచరణకు మా నాయకుడు సరైన ఉదాహరణ: నాగబాబు

image

హైందవ ధర్మాన్ని పవన్ కళ్యాణ్ అమితంగా నమ్ముతారని నాగబాబు ట్విటర్‌లో తెలిపారు. ‘కలియుగంలో ధర్మం ఒక పాదం మీదే నడుస్తుంది. ఒక పాదమే అయినా ఆ నడక బలంగా ఉండేందుకు నా వంతు పాత్ర పోషిస్తాను. నా ప్రయత్నం సంపూర్ణంగా చేస్తాను అని చాలాకాలం క్రితం కళ్యాణ్ బాబు నాతో చెప్పిన మాట. ధర్మాచరణకు తను సరైన ఉదాహరణ. అది ఈరోజు మళ్లీ నిరూపితమైంది’ అని అందులో పేర్కొన్నారు.

Similar News

News September 25, 2024

షాహిన్ అఫ్రీదికి గాయం.. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు దూరం?

image

ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు ముందు పాకిస్థాన్‌కు షాక్ తగిలింది. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా అఫ్రీదికి గాయమైంది. దీంతో అతడు టెస్ట్ సిరీస్‌కు దూరమయ్యే ఛాన్సుంది. ఛాంపియన్స్ వన్డేకప్‌లో డాల్ఫిన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అతను గాయపడ్డాడు. మోకాలికి బంతి బలంగా తాకడంతో తీవ్రంగా గాయపడి మైదానాన్ని వీడారు. ప్రస్తుతం వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నారు. OCT 7 నుంచి ఇంగ్లండ్‌తో సిరీస్ ప్రారంభం కానుంది.

News September 25, 2024

కూలగొట్టడం తప్ప.. కొత్తవి నిర్మించే తెలివి లేదు: మాజీ మంత్రి

image

TG: రాష్ట్రంలో అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. వెంటనే రైతు భరోసాని అమలు చేయాలన్నారు. తెలంగాణలో పోలీస్ రాజ్యం మొదలుపెట్టారని అన్నారు. పోలీసులు నిబంధనలు అతిక్రమించి చిన్న తప్పు చేసినా శిక్షార్హులు అవుతారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. ఉన్నవి కూలగొట్టడం తప్ప, కొత్తవి నిర్మించే తెలివి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని దుయ్యబట్టారు.

News September 25, 2024

ఉక్రెయిన్‌కు మా మద్దతు కొనసాగుతుంది: బైడెన్

image

ఉక్రెయిన్‌లో శాంతి నెలకొనే వరకూ ఆ దేశానికి తమ మద్దతు కొనసాగుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. నాటో మిత్ర దేశాలు కలిసికట్టుగా ఉండటంతో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం విఫలమైందని పేర్కొన్నారు. ఫిన్లాండ్, స్వీడన్ దేశాలు కొత్తగా నాటోలో చేరడంతో మరింత బలం చేకూరిందని చెప్పారు. పశ్చిమాసియా సంక్షోభంతోపాటు సూడాన్‌లో 17 నెలలుగా కొనసాగుతున్న అంతర్యుద్ధానికి ముగింపు పలకాల్సిన అవసరం ఉందన్నారు.