News June 13, 2024
మా నేతలను ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉంది: సుబ్బారెడ్డి

AP: టీడీపీ నేతల దాడులకు భయపడొద్దని పార్టీ శ్రేణులకు భరోసా ఇస్తున్నామని ఆ పార్టీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. కార్యకర్తలకు పార్టీ అన్నివిధాల అండగా ఉంటుందని అన్నారు. విశాఖలో కార్పొరేటర్లతో భేటీ అనంతరం ఆయన మాట్లాడారు. కార్పొరేషన్, స్థానిక సంస్థల్లో తమ ప్రజాప్రతినిధులను ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉందని అన్నారు. వాటికి లొంగకుండా అందరం కలిసి సమష్టి సమీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Similar News
News October 22, 2025
మిరప సాగు – విత్తన మోతాదు, విత్తన శుద్ధి

వర్షాధారంగా మిరపను సాగు చేస్తారు. ఈ పంటకు నల్ల, ఇసుకతో కూడిన ఒండ్రు నేలలు అనుకూలం. మిరపకు మెత్తని దుక్కికావాలి. అందుకే నేలను 3-4 సార్లు దున్ని 2సార్లు గుంటక తోలాలి. విత్తనం ఎద బెట్టేందుకు ఎకరానికి 2.5KGల విత్తనం అవసరం. రసం పీల్చే పురుగుల నివారణకు కిలో విత్తనానికి 8 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ను, తెగుళ్ల నివారణకు కిలో విత్తనానికి 3గ్రాముల కాప్టాన్ లేదా 3 గ్రాముల మాంకోజెబ్ కలిపి విత్తన శుద్ధిచేయాలి.
News October 22, 2025
అధికారంలోకి రాగానే బల్క్ డ్రగ్ పార్కు రద్దు చేస్తాం: బొత్స

AP: అనకాపల్లి(D) రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న మత్స్యకారులకు అండగా ఉంటామని YCP MLC బొత్స సత్యనారాయణ అన్నారు. ‘ఆందోళన చేస్తున్న మత్స్యకారులు సంఘ విద్రోహ శక్తులా? వారిని ఎందుకు నిర్బంధిస్తున్నారు? వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బల్క్ డ్రగ్ పార్కును రద్దు చేస్తాం. త్వరలో జగన్ రాజయ్యపేటలో పర్యటిస్తారు’ అని స్పష్టం చేశారు.
News October 22, 2025
వంట చేసేటపుడు ఈ తప్పులు చేస్తున్నారా?

ఆరోగ్యంగా ఉండటానికి ఎలా వంట చేస్తున్నామనేది కూడా ముఖ్యమంటున్నారు నిపుణులు. డీప్ ఫ్రైడ్, ఎయిర్ ఫ్రైయర్లో చేసే కొన్ని వంటలు, చికెన్, చేపలను ఎక్కువగా గ్రిల్ చేస్తే హెటెరోసైక్లిక్ అమైన్, పాలీసైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్, నాన్స్టిక్ పాన్లలో వంట చేస్తే విషపూరిత పదార్థాలు విడుదలవుతాయంటున్నారు. బేకింగ్, రోస్టింగ్, తక్కువ మంటపై ఉడికించడం వల్ల ఆహారంలో పోషకాలు నశించకుండా ఉంటాయని సూచిస్తున్నారు.