News November 20, 2024
ఢిల్లీలో మన పరపతి వేరే లెవెల్: చంద్రబాబు
AP: 21 మంది ఎంపీలుండటంతో ఢిల్లీలో మన పరపతి బాగా పెరిగిందని సీఎం చంద్రబాబు తెలిపారు. కేంద్రం సహకారంతో రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామని చెప్పారు. ‘గత ప్రభుత్వం చేసిన అప్పులు, తప్పులు శాపంగా మారాయి. రాష్ట్రం దాదాపు వెంటిలేటర్‌పై ఉన్నట్లుంది. ఇచ్చిన హామీలపై నిరంతరం సమీక్షిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయం. ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Similar News
News November 20, 2024
వార్నర్‌తో వివాదాన్ని ముగిస్తా: జాన్సన్
ఆస్ట్రేలియా మాజీ బ్యాటర్ డేవిడ్ వార్నర్‌తో వివాదాన్ని ముగిస్తానని ఆ జట్టు మాజీ బౌలర్ మిచెల్ జాన్సన్ తెలిపారు. బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో వీరిద్దరూ వ్యాఖ్యాతలుగా వ్యవహరించనున్నారు. ఈ నేపథ్యంలోనే పాత వివాదానికి ఫుల్ స్టాప్ పెడతానని జాన్సన్ అన్నారు. వార్నర్‌కు ఆస్ట్రేలియా బోర్డు ఫేర్వెల్ టెస్ట్ కేటాయించినప్పుడు.. బాల్ ట్యాంపరింగ్ నిందితుడికి ఇలాంటివెందుకంటూ జాన్సన్ మండిపడ్డారు.
News November 20, 2024
అభివృద్ధిని అడ్డుకునేందుకు కాళ్లలో కట్టెలు పెడుతున్నారు: రేవంత్
TG: పదేళ్లలో KCR చేయలేని పనులను తాము పూర్తి చేస్తున్నామని CM రేవంత్ అన్నారు. KCR ఫామ్‌హౌస్‌లో పడుకుంటే KTR, హరీశ్ మన కాళ్ల మధ్య కట్టెలు పెట్టి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. BRS సరిగా పరిపాలన చేసి ఉంటే రైతు రుణమాఫీ చేయాల్సి వచ్చేదా? అని ప్రశ్నించారు. రూ.11వేల కోట్ల రుణమాఫీకి KCR పదేళ్లు తీసుకుంటే, తాము 25 రోజుల్లో రూ.18వేల కోట్లు మాఫీ చేశామని వేములవాడ సభలో CM స్పష్టం చేశారు.
News November 20, 2024
జపాన్‌లో తొలి మూడేళ్లు పిల్లలకు పరీక్షలే ఉండవు!
పిల్లలు పుట్టగానే వారిని ఇంజినీర్ లేదా డాక్టర్ చేయించాలని చాలా మంది అనుకుంటుంటారు. రూ.లక్షలు చెల్లించి స్కూల్లో జాయిన్ చేయించి మార్కులు, గ్రేడ్స్ అంటూ వారిని అప్పటి నుంచే ఇబ్బంది పెడుతుంటారు. కానీ, జపాన్‌లో అలా కాదు. అక్కడి పిల్లలకు స్కూల్లో మొదటి మూడేళ్లు పరీక్షలు, గ్రేడ్స్ ఉండవు. కేవలం మంచి మర్యాదలు నేర్పిస్తారు. ఒకరినొకరు గౌరవించుకోవడం, ఉదారంగా ఉండటం, ప్రకృతి పట్ల దయగా ఉండటం నేర్పిస్తారు.