News November 19, 2024
గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడమే మా ధ్యేయం: పవన్
AP: చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాల నిర్వహణకు నిధులు ఇచ్చామని dy.CM పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇందుకోసం 15వ ఫైనాన్స్ నిధులు కేటాయించామని చెప్పారు. శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ‘గ్రామాలను స్వచ్ఛంగా ఉంచడం మా బాధ్యత. ఇందుకోసం చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాలను సమర్థంగా నిర్వహిస్తాం. ప్రతీ మండల కేంద్రంలో ఓ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News November 19, 2024
PSU, CPSE ఇన్వెస్టర్లకు గుడ్న్యూస్
PSU, CPSE షేర్లలో ఇన్వెస్ట్ చేస్తుంటారా? అయితే మీకో శుభవార్త! ఈ ఇన్వెస్టర్లకు నిలకడగా రాబడి అందించేందుకు ప్రభుత్వం సరికొత్త గైడ్లైన్స్ తీసుకొచ్చింది. ఇకపై ఏటా పన్నేతర ఆదాయంలో 30% లేదా కంపెనీ నెట్వర్త్లో 4% విలువకు సమానంగా డివిడెండ్ ఇవ్వాలని ఆదేశించింది. వరుసగా 6 నెలలు షేర్ల ధర బుక్వ్యాలూ కన్నా తక్కువగా ఉండి, కంపెనీ నెట్వర్త్ రూ.3000CR, నగదు రూ.1500CR ఉంటే బయ్బ్యాక్ చేయొచ్చని తెలిపింది.
News November 19, 2024
విశాఖలో దారుణం.. విద్యార్థినిపై గ్యాంగ్ రేప్
AP: విశాఖలో న్యాయ విద్య అభ్యసిస్తోన్న యువతిపై నలుగురు సామూహిక అత్యాచారం చేశారు. ఆ దృశ్యాలను సెల్ఫోన్లతో చిత్రీకరించి బెదిరిస్తూ పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డారు. వేధింపులు తాళలేక ఆమె ఆత్మహత్యాయత్నం చేయగా తండ్రి కాపాడారు. విషయం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేయగా, నిందితులు వంశీ, ఆనంద్, రాజేశ్, జగదీశ్ను అరెస్టు చేశారు. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీని హోంమంత్రి అనిత ఆదేశించారు.
News November 19, 2024
TTDలో ఇక హిందూ ఉద్యోగులే..
AP: టీటీడీలో 7వేల మంది పర్మనెంట్ ఉద్యోగులు ఉండగా అందులో 300 మంది అన్యమతస్థులు (హిందువులు కాని వారు) ఉన్నారు. తాజాగా బోర్డు తీసుకున్న నిర్ణయం ప్రకారం వీరిని ఇతర ప్రభుత్వ శాఖల్లోకి పంపుతారు. లేదంటే స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 16(5) సమ్మతిస్తుంది. కాగా టీటీడీలో హిందువులే ఉద్యోగులుగా ఉండాలని ఎప్పటినుంచో డిమాండ్ వినిపిస్తోంది. TTD తాజా నిర్ణయంపై మీ కామెంట్?