News October 17, 2024

మనవాళ్లు కష్టంగా.. వాళ్లు అలవోకగా..

image

భారత బ్యాటర్లు ఘోరంగా విఫలమైన బెంగళూరు పిచ్‌పై కివీస్ ఆటగాళ్లు స్వేచ్ఛగా ఆడుతున్నారు. ఓపెనర్లు కాన్వే, లాథమ్ తొలి వికెట్‌కు 67 పరుగులు రాబట్టారు. IND బ్యాటర్లు బౌండరీలు కొట్టేందుకు తీవ్రంగా ఇబ్బందిపడగా NZ ప్లేయర్లు అలవోకగా ఫోర్లు, సిక్సర్లు బాదుతున్నారు. 15 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద లాథమ్ ఔట్ కాగా కాన్వే(65) సెంచరీ వైపు దూసుకెళ్తున్నారు. యంగ్ 22* రన్స్ చేశారు. ప్రస్తుతం NZ స్కోర్ 107/1.

Similar News

News February 11, 2026

VASTHU: స్మశానాలకు దగ్గర నివసించవచ్చా?

image

స్మశానాలకు దగ్గరగా నివసించడం శ్రేయస్కరం కాదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ‘స్మశానాల వద్ద జరిగే కార్యక్రమాలు నిరాశను, వైరాగ్యాన్ని కలిగిస్తాయి. అక్కడి గాలి అనారోగ్యానికి దారితీసే ప్రమాదం ఉంది. ఇది మనిషి శారీరక, మానసిక ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయి. అందుకే నిలకడైన అభివృద్ధి కోసం ఇలాంటి ప్రదేశాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకోకపోవడమే ఉత్తమం’. అని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>

News February 11, 2026

చికెన్‌లో ఈ భాగాలు తినకండి

image

కోళ్ల లంగ్స్‌లోని పరాన్నజీవులు ఎక్కువ వేడిని తట్టుకోగలవు. మనం బాగా ఉడికించినా కొన్ని నశించకపోవచ్చు. పెస్టిసైడ్స్ తింటే కోడి తలలో చిన్న కణితులు ఏర్పడతాయి. కాబట్టి తల జోలికి వెళ్లకపోవడం బెటర్. కాళ్ల వేళ్లు, ప్రేగులు, జీర్ణాశయంలో బాక్టీరియా పేరుకుంటుంది. సాధారణంగా శుభ్రం చేస్తే అవి పోవు. స్కిన్ పూర్తిగా కొలెస్ట్రాల్ కావడంతో ఊబకాయులు, హార్ట్ సమస్యలు ఉన్నవారు తినకండి.

News February 11, 2026

జగ్గారెడ్డిపై ఎన్నికల సంఘం ఆగ్రహం

image

TG: సంగారెడ్డిలో జగ్గారెడ్డి <<19110877>>వ్యవహారంపై<<>> రాష్ట్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఆయన కామెంట్స్ ఓటర్ల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొంది. ఆయనపై కేసు నమోదు చేసి, రిపోర్ట్ ఇవ్వాలని జిల్లా ఎస్పీని ఆదేశించింది. కాగా సీఐ కాంగ్రెస్ అభ్యర్థి చొక్కా పట్టుకున్నారంటూ పోలీసులపై జగ్గారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. పోలింగ్ ఆపుతానంటూ పోలింగ్ కేంద్రంలోకి దూసుకెళ్లిన విషయం తెలిసిందే.