News October 6, 2024
హరియాణాలో మాదే అధికారం: సీఎం సైనీ

హరియాణాలో ఎగ్జిట్ పోల్స్ ప్రతికూలంగా ఉన్నప్పటికీ తిరిగి తామే అధికారంలోకి వస్తామని సీఎం నయబ్ సింగ్ సైనీ ధీమా వ్యక్తం చేశారు. పూర్తి మెజార్టీతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. తాము అన్ని రంగాల్లో పనులు చేశామని, ప్రజలు ఈ విషయాన్ని గమనించారని పేర్కొన్నారు. హరియాణాను వారసత్వం, ప్రాంతీయతత్వం నుంచి వేరు చేసినట్లు పేర్కొన్నారు. కాగా 90 స్థానాలకు ఈ నెల 8న ఓట్ల లెక్కింపు జరగనుంది.
Similar News
News December 4, 2025
పంట వ్యర్థాలను కలియదున్నితే కలదు లాభం

పంటకాలం పూర్తయ్యాక వ్యర్థాలను నేలలో కలియదున్నడం వల్ల సేంద్రీయ కర్బనశాతం పెరుగుతుంది. తర్వాతి పంట దిగుబడులు 5 నుంచి 10 శాతం పెరిగే అవకాశముంది. వ్యర్థాలను దుక్కి దున్నే సమయంలో నిపుణుల సూచనతో భూమిలో సూపర్ ఫాస్పెట్ చల్లితే అవశేషాలు రెండు వారాల్లో మురిగి పోషకాలుగా మారతాయి. ఫలితంగా డీఏపీ వాడకం సగం వరకు తగ్గుతుంది. పచ్చిరొట్టను కలియదున్నితే తర్వాత వేసే పంటకు అది ఎరువుగా మారి మంచి దిగుబడులు వస్తాయి.
News December 4, 2025
హనీమూన్ వెకేషన్లో సమంత-రాజ్!

ప్రస్తుతం సోషల్ మీడియాలో సమంత-రాజ్ పెళ్లి గురించే చర్చ జరుగుతోంది. డిసెంబర్ 1న పెళ్లి చేసుకున్న ఈ జంట మరుసటి రోజే హనీమూన్కు గోవా వెళ్లినట్లు తెలుస్తోంది. శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఈ కపుల్ వెళ్తున్న వీడియోలు వైరలయ్యాయి. కాగా 2 ఏళ్లకు పైగా రిలేషన్లో ఉన్న ఈ జోడీ కోయంబత్తూర్లోని ఈషా ఫౌండేషన్లో ‘భూత శుద్ధి వివాహం’ పద్దతిలో ఒక్కటైన సంగతి తెలిసిందే.
News December 4, 2025
OTTలోకి మిషన్ ఇంపాజిబుల్: ది ఫైనల్ రెకనింగ్

‘మిషన్ ఇంపాజిబుల్: ది ఫైనల్ రెకనింగ్’ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. టామ్ క్రూజ్, హేలే అట్వెల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ ఆగస్టులో రెంటల్ పద్ధతిలో విడుదల చేయగా తాజాగా ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఉంటే చూడొచ్చు. ఈ చిత్రం ఈ ఏడాది మేలో విడుదలైంది.


