News July 23, 2024

బడ్జెట్‌లో ఈ తొమ్మిదింటికి మా ప్రాధాన్యం: నిర్మల

image

బడ్జెట్‌లో 9 అంశాలకు తాము అత్యంత ప్రాధాన్యాన్ని ఇచ్చినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అవి..
⇨ వ్యవసాయంలో ఉత్పాదకత పెంపు
⇨ ఉద్యోగాల కల్పన, నైపుణ్యాల పెంపు
⇨ మానవ వనరుల అభివృద్ధి, సామాజిక న్యాయం
⇨ ఉత్పత్తి-సేవలు
⇨ పట్టణాభివృద్ధి
⇨ ఇంధన భద్రత
⇨ మౌలికవసతులు
⇨ ఆవిష్కరణ, పరిశోధన, అభివ‌ృద్ధి
⇨ అత్యాధునిక సంస్కరణలు

Similar News

News November 27, 2025

నంద్యాల ఫిజియోథెరపిస్టుకు జాతీయస్థాయి పురస్కారం

image

నంద్యాల జిల్లా ఫిజియోథెరపిస్టుల సంఘం కార్యదర్శి డాక్టర్ శివ బాలి రెడ్డి జాతీయస్థాయి పురస్కారాన్ని అందుకున్నారు. వారణాసిలోని బెనారస్ హిందూ యూనివర్సిటీలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఆయన ఈ గౌరవాన్ని పొందారు.
సదస్సులో సమర్పించిన పరిశోధన పత్రానికి గాను ఆయనకు ఉత్తమ వైజ్ఞానిక పరిశోధన పత్రం పురస్కారం లభించింది. జిల్లాలోని ప్రముఖులు డా. శివ బాలి రెడ్డిని అభినందించారు.

News November 27, 2025

ధాన్యం కొనుగోళ్లపై వైసీపీ అబద్ధాలు: నాదెండ్ల

image

AP: రైతులకు నష్టం లేకుండా ధాన్యం కొంటున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. 24 గంటల్లోనే ఖాతాల్లో డబ్బులు వేస్తున్నామని చెప్పారు. అయినా YCP నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ₹1,674 కోట్లు బకాయిలు పెట్టి పారిపోయిన వాళ్లా రైతుల పక్షాన మాట్లాడేదని మండిపడ్డారు. 8.22 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామన్నారు. దళారులను నమ్మి రైతులు తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోవద్దని కోరారు.

News November 27, 2025

పాక్ న్యూక్లియర్ కంట్రోల్స్ ఆసిమ్ మునీర్ చేతికి!

image

పాకిస్థాన్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ ఆ దేశ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్‌(CDF)గా బాధ్యతలు చేపట్టారు. అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌కు అతను అధిపతిగా ఉంటారు. ఆ దేశ ప్రధానికి సరిసమానమైన పవర్స్ మాత్రమే కాదు లీగల్ ప్రొటెక్షన్ కూడా ఆసిమ్ మునీర్‌కు ఉంటుందని చెబుతున్నారు. అతనికి కేసుల నుంచి లైఫ్ టైమ్ ఇమ్యూనిటీతో పాటు న్యూక్లియర్ వెపన్స్ కంట్రోల్స్ కూడా అతని చేతికే ఇస్తారని తెలుస్తోంది.