News October 9, 2024
మా రికార్డు భారత్‌కు దరిదాపుల్లో కూడా లేదు: మోర్గాన్

టీమ్ ఇండియా పోరాట స్ఫూర్తిపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ప్రశంసలు కురిపించారు. భారత్ ఆ స్ఫూర్తిని కొనసాగిస్తే BGTలో ఆస్ట్రేలియాకు కష్టాలు తప్పవన్నారు. ‘స్వదేశ పరిస్థితుల్లో భారత్‌ను కొట్టడం దాదాపు ఆసాధ్యం. గెలవాలన్న పట్టుదలే వారిని పటిష్ఠంగా మార్చింది. మా దేశంలోనూ స్వదేశ పరిస్థితులు మాకు అనుకూలమే. కానీ మా తరతరాల రికార్డు తీసుకున్నా భారత్‌కు కనీసం దరిదాపుల్లో లేదు’ అని పేర్కొన్నారు.
Similar News
News January 27, 2026
రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్

ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ కేన్ రిచర్డ్‌సన్(34 ఏళ్లు) క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. కేన్ 25 వన్డేలు, 36 T20Iలు ఆడారు. 2021 T20 వరల్డ్‌కప్ గెలిచిన ఆసీస్ టీమ్‌లో సభ్యుడిగా ఉన్నారు. బిగ్ బాష్ లీగ్‌లో అన్ని సీజన్లలో ఆడిన కొద్దిమందిలో రిచర్డ్‌సన్ ఒకరు. BBLలో 142 వికెట్లు తీశారు. ఐపీఎల్ సహా పలు లీగ్‌ల్లోనూ ఆడి తనదైన ముద్ర వేశారు. IPLలో RCB, RR, PWI తరఫున ఆడారు.
News January 27, 2026
మునగలో కాయతొలుచు ఈగ నివారణకు సూచనలు

మునగ పంటలో విత్తనాలు నాటిన 5 నెలలకు పూత దశ ప్రారంభమవుతుంది. ఈ సమయంలో పంటకు కాయ తొలుచు ఈగ ముప్పు ఎక్కువ. ఇది పంటను ఆశించి పిందె దశలో కాయలోకి ప్రవేశించి లోపలి పదార్థాన్ని తిని నాశనం చేస్తుంది. దీని వల్ల కాయల ఆకారం మారిపోయి వంకరగా అవుతాయి. కాయతొలుచు ఈగ నివారణకు పూత దశలో లీటరు నీటికి ఫానలోన్ 2ml కలిపి పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
News January 27, 2026
లోకేశ్ యువగళం పాదయాత్రకు 3 ఏళ్లు

AP: నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు నేటితో మూడేళ్లు పూర్తయ్యాయి. 2023 జనవరి 27న కుప్పంలో శ్రీ వరదరాజస్వామి ఆలయం వద్ద ప్రారంభమైన ఈ యాత్ర 226 రోజుల పాటు 3,132 కిలోమీటర్లు సాగింది. ఈ సందర్భంగా లోకేశ్ ట్వీట్ చేశారు. తన పాదయాత్రలో రైతులు, మహిళలు, యువత, కార్మికులు సహా అన్ని వర్గాల సమస్యలను తెలుసుకున్నానని తెలిపారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా తమ విధానాలు ఉంటాయని స్పష్టం చేశారు.


