News March 28, 2025

USతో మా బంధం శాశ్వతంగా ముగిసింది: కెనడా పీఎం

image

USతో ఇన్నేళ్లుగా తమకున్న ఆర్థిక, సైనిక, భద్రతాపరమైన బంధం ఇక ముగిసిపోయిందని కెనడా PM మార్క్ కార్నీ ప్రకటించారు. ‘ట్రంప్ విధించిన సుంకాలు అన్యాయమైనవి. అలా విధించడం మా మధ్య ఇప్పటికే ఉన్న వాణిజ్య ఒప్పందాలను ఉల్లంఘించడమే. ఇరు దేశాల బంధాన్ని ట్రంప్ పూర్తిగా మార్చేశారు. ఇక వెనక్కి వెళ్లేది, తగ్గేది లేదు. ఆ దేశానికి తగిన సమాధానాన్ని ఇవ్వనున్నాం. మా ఆత్మగౌరవం, భద్రత మాకు ముఖ్యం’ అని తేల్చిచెప్పారు.

Similar News

News March 1, 2026

వేరుశనగలో పొగాకు లద్దె పురుగు నివారణ ఎలా?

image

వేరుశనగలో పొగాకు లద్దె పురుగు నివారణకు ఎకరాకు 200 లీటర్ల నీటిలో నొవాల్యురాన్ 200ML లేదా ఫ్లూబెండమైడ్ 40MLను కలిపి పిచికారీ చేయాలి. పురుగు ఉద్ధృతి మరీ ఎక్కువగా ఉంటే 10 కిలోల తవుడు, KG బెల్లం, లీటరు క్లోరిపైరిఫాస్ మందును కలిపి, తగిన నీటిని జోడించి ఉండలుగా చేసి విషపు ఎరలను తయారు చేసుకోవాలి. వీటిని సాయంత్రం వేళ సమానంగా ఒక ఎకరా పొలంలో చల్లి పురుగు ఉద్ధృతిని తగ్గించుకోవచ్చంటున్నారు వ్యవసాయ నిపుణులు.

News March 1, 2026

ధ్యానం ఎందుకు చేయాలి?

image

‘ధ్యానం’ ఆయుర్వేద అభ్యాసంగా మన భారతదేశంలో పుట్టిన ఓ గొప్ప సంప్రదాయం. నేడు మానసిక ప్రశాంతత కోసం ప్రపంచవ్యాప్తంగా దీనిని అనుసరిస్తున్నారు. ధ్యానం కేవలం ఓ ఆధ్యాత్మిక ప్రక్రియే అనుకుంటే పొరపాటే! ఇది మన శారీరక, మానసిక ఆరోగ్యానికి మేలు చేసే ఓ సంపూర్ణ ఆరోగ్య సాధనం. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. క్రమం తప్పకుండా ధ్యానం చేస్తే జీవితంలో క్రమశిక్షణ, స్పష్టత, ఏకాగ్రత పెరుగుతాయి.

News March 1, 2026

ఎగ్జిమ్ బ్యాంక్‌లో 20 పోస్టులు.. అప్లై చేశారా?

image

ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 20 డిప్యూటీ మేనేజర్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ(MBA/PGDBA/PGDBM/MMS), ఫైనాన్స్ స్పెషలైజేషన్‌తో పాటు ICAIలో సభ్యత్వం ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. వయసు 21-28 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.eximbankindia.in