News April 14, 2025
ప్రపంచంలోని ప్లాస్టిక్ చెత్తలో మన వాటా 3.54%

ప్రపంచ వ్యాప్తంగా 2022లో 26.8 కోట్ల టన్నుల ప్లాస్టిక్ చెత్త పోగైతే, అందులో 95 లక్షల టన్నులతో భారతదేశం 3.54 శాతం వాటా కలిగి ఉందని నేచర్ జర్నల్లోని ఓ కథనం తెలిపింది. 8.15 కోట్ల టన్నుల చెత్త ఉత్పన్నంతో చైనా మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత అమెరికా, యూరోపియన్ దేశాలు ఉన్నాయి. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని ప్రభుత్వాలు పదే పదే చెబుతూనే ఉన్నా ప్రజల్లో ఆచరణ అంతంతమాత్రంగానే ఉంటోంది.
Similar News
News April 15, 2025
రేపు దిల్ రాజు ‘భారీ’ అనౌన్స్మెంట్!

నిర్మాత దిల్ రాజు నుంచి రేపు ఉదయం 11.08 ఓ భారీ అనౌన్స్మెంట్ రానుంది. ఆయన నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ ఈ విషయాన్ని ట్విటర్లో ప్రకటించింది. ‘బోల్డ్.. బిగ్.. బియాండ్ ఇమాజినేషన్’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. సినిమాల్లో AI టెక్నాలజీ వాడేందుకు దిల్ రాజు ఓ సంస్థతో ఒప్పందం చేసుకోవడం లేదా సొంతంగా సంస్థ ప్రారంభించడం ఈ ప్రకటన వెనుక కారణం కావొచ్చని సినీవర్గాలంటున్నాయి.
News April 15, 2025
BREAKING: అకౌంట్లో రూ.1,00,000 జమ

TG: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తొలి విడతగా 12 మంది లబ్ధిదారులకు ఈ పథకం కింద ₹లక్ష సాయాన్ని అందించింది. CLP మీటింగ్ అనంతరం పలువురు లబ్ధిదారులకు CM రేవంత్ రెడ్డి ₹లక్ష విలువైన చెక్కులు ఇచ్చారు. కాగా బేస్మెంట్ వరకు ఇళ్లు నిర్మిస్తే ₹లక్ష, గోడలు నిర్మించాక ₹1.25 లక్షలు, స్లాబ్ వేశాక రూ.1.75 లక్షలు, నిర్మాణం పూర్తయ్యాక మరో ₹.లక్ష సాయాన్ని ప్రభుత్వం అందించనుంది.
News April 15, 2025
వాట్సాప్ యూజర్లకు క్రేజీ న్యూస్

వాట్సాప్ తమ వినియోగదారుల కోసం కొత్త ఫీచర్లపై దృష్టి పెట్టింది. తాజాగా స్టేటస్ అప్డేట్స్లో వీడియోల డ్యూరేషన్ను పెంచింది. ఇప్పటివరకు 30 సెకండ్ల వ్యవధి ఉన్న వీడియోలను మాత్రమే స్టేటస్ పెట్టుకునే అవకాశం ఉండేది. ఆ సమయాన్ని 90 సెకండ్లకు పెంచింది. ప్రస్తుతం ఈ అప్డేట్ కొంతమంది బీటా యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. త్వరలో అందరూ ఉపయోగించుకోవచ్చు.