News November 12, 2024
మా అబ్బాయి రికార్డుల కోసం చూడడు: శాంసన్ తండ్రి

తన కుమారుడు జట్టు కోసమే తప్ప వ్యక్తిగత రికార్డుల గురించి ఆలోచించడని భారత క్రికెటర్ సంజూ శాంసన్ తండ్రి శాంసన్ విశ్వనాథ్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ‘సంజూ వరస సెంచరీలు చేయడం సంతోషంగా ఉంది. ఇది ఇలాగే కొనసాగాలి. ఇన్నేళ్లూ తనకు సరైన అవకాశాలు దక్కలేదు. ఇకపై వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటూ ఆడాలి. కొంతమంది స్వార్థం కోసం, జట్టులో చోటు కోసం ఆడతారు. సంజూ ఎప్పుడూ అలా ఆడడు’ అని స్పష్టం చేశారు.
Similar News
News July 8, 2025
మహిళా సంఘాలకు రూ.12 కోట్లు విడుదల: కలెక్టర్

సంగారెడ్డి జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం స్వయం సహాయక సంఘాలకు రూ.12 కోట్ల నిధులను విడుదల చేసినట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం సమావేశం నిర్వహించారు. జిల్లాలో 14,529 ఇళ్లు మంజూరు కాగా 692 ఇళ్లకు బేస్మెంట్ పనులు పూర్తయినట్లు పేర్కొన్నారు. 532 ఇళ్లకు రూ లక్ష చొప్పున నిధులు మంజూరు చేసినట్లు వివరించారు.
News July 8, 2025
తోడు కోసం పెళ్లి చేసుకుంటే రూ.28 కోట్లతో జంప్!

AP: చిత్తూరు(D) రాజుపేటకు చెందిన నాగమణి (50) గతంలో భర్త, కుమారుడిని కోల్పోయారు. శేష జీవితంలో తోడు కోసం పెళ్లి బ్రోకర్ ద్వారా ప్రకటన ఇచ్చారు. శేషాపురానికి చెందిన శివప్రసాద్(40) కరోనాతో తన భార్య చనిపోయిందని నమ్మించి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. బెంగళూరులో నాగమణికి చెందిన రూ.10 కోట్ల విలువైన భూమి, రూ.15 కోట్ల అపార్ట్మెంట్ విక్రయించడంతో పాటు రూ.3 కోట్లు తీసుకుని పారిపోయాడు. ఆమె పోలీసులను ఆశ్రయించారు.
News July 8, 2025
కొత్త పంచాయతీ భవన నిర్మాణాలకు ఆమోదం

AP: సొంత భవనాలు లేని 417 గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఒక్కో భవనాన్ని రూ.32 లక్షలతో నిర్మించేందుకు అనుమతిస్తూ జీవో జారీ చేసింది. ఇందులో రాష్ట్రీయ గ్రామ స్వరాజ్య అభియాన్ నుంచి రూ.25 లక్షలు, ఉపాధి హామీ పథకం కింద రూ.7లక్షల నిధులను ఉపయోగించుకోవాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ పేరుతో ఉత్తర్వులు జారీ అయ్యాయి.