News August 31, 2025

మా సూచనలను పరిగణనలోకి తీసుకోలేదు: MLA గంగుల

image

TG: BCలకు 42% రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొంది, ఎలాంటి న్యాయ చిక్కులు లేకుండా అమలైతే తామూ సంతోషిస్తామని BRS MLA గంగుల కమలాకర్ తెలిపారు. ‘మేం BC బిల్లుకు గతంలో మద్దతు ఇచ్చాం. శాస్త్రీయ పరంగా చేస్తే సక్సెస్ అవుతుందని, అశాస్త్రీయంగా వెళ్తే కోర్టులో మొట్టికాయలు పడతాయని చెప్పాం. మా సూచనలను పరిగణనలోకి తీసుకోలేదు. మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన వేసిన BC కమిషన్ మాయమైంది’ అని అసెంబ్లీలో వ్యాఖ్యానించారు.

Similar News

News September 1, 2025

ఈ వారంలో వరుసగా 3 రోజులు సెలవులు!

image

ఈ వారంలో స్కూళ్లకు వరుస సెలవులు రానున్నాయి. సెప్టెంబర్ 5న (శుక్రవారం) మిలాద్-ఉన్-నబీ సందర్భంగా ఏపీ, తెలంగాణలో పబ్లిక్ హాలిడే ఇచ్చారు. 6న వినాయక నిమజ్జనాల సందర్భంగా హైదరాబాద్‌లో సెలవు ఉండనుంది. ఏపీలో ఆరోజు సెలవు ఇచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఇక 7న ఆదివారం వస్తోంది. మరి వరుస సెలవుల నేపథ్యంలో హాలిడే ట్రిప్‌కు ప్లాన్ చేస్తున్నారా? కామెంట్ చేయండి.

News September 1, 2025

భారీ కుంభకోణాల దర్యాప్తుల్లో CBI

image

కాళేశ్వరంపై <<17577217>>CBI<<>> విచారణ చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనతో మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ కింద పనిచేసే CBI విచారణ చేపట్టనుంది. ఈ సంస్థ 1990 హవాలా, 2009లో సత్యం కంప్యూటర్స్, 2G స్పెక్ట్రమ్ కేటాయింపు కుంభకోణాల కేసులపై దర్యాప్తు చేసింది. CBI డైరెక్టర్‌ను ప్రధాన మంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ఉండే కమిటీ ఎంపిక చేస్తుంది.

News September 1, 2025

నేడు, రేపు ధర్నాలకు BRS పిలుపు

image

TG: ‘కాళేశ్వరం’ కమిషన్ నివేదికపై బీఆర్ఎస్ నిరసనలకు పిలుపునిచ్చింది. కాంగ్రెస్ కుట్రలపై ఇవాళ, రేపు జిల్లా, మండల కేంద్రాల్లో ధర్నాలు, రాస్తారోకోలు, బైక్ ర్యాలీలు చేయాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పార్టీ శ్రేణులకు సూచించారు. అంతకుముందు పార్టీ అధినేత కేసీఆర్‌తో ఆయన భేటీ అయ్యారు. కాగా కాళేశ్వరంపై తప్పుడు నివేదిక రూపొందించారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.