News May 2, 2024

APలో మా మద్దతు జగన్‌కే: అసదుద్దీన్

image

TG: ఏపీలో తమ మద్దతు సీఎం వైఎస్ జగన్‌కేనని MIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. ‘ఆంధ్రలో టీడీపీ-జనసేన కూటమిలో నటులు ఉంటే.. దేశంలోనే మహానటుడు మోదీ. మోదీని ప్రశ్నించే దమ్ము చంద్రబాబుకు లేదు. ప్రధానిని ఢీకొట్టే సత్తా జగన్‌కే ఉంది. చంద్రబాబు గెలిస్తే మోదీ చేతిలో కీలుబొమ్మగా మారతారు. జగన్ సీఎంగా ఉంటే ఏపీలో మైనారిటీ హక్కులను పరిరక్షిస్తారు. అందుకే ఏపీలోని ప్రజలు జగన్‌కే ఓటేయాలి’ అని ఆయన విజ్ఞప్తి చేశారు.

Similar News

News December 25, 2024

రేపటి టెస్టులో రోహిత్ ఓపెనింగ్!

image

రేపటి నుంచి ప్రారంభమయ్యే బాక్సింగ్ డే టెస్టులో కెప్టెన్ రోహిత్ శర్మ ఓపెనింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. యశస్వీతో కలిసి హిట్‌మ్యాన్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తారని, కేఎల్ రాహుల్ మూడో స్థానంలో వస్తారని వార్తలు వస్తున్నాయి. మరోవైపు భారత్ ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. నితీశ్ కుమార్ రెడ్డి స్థానంలో సుందర్ వస్తారని తెలుస్తోంది.

News December 25, 2024

ఫార్ములా-ఈ రేస్ కేసులో కీలక పరిణామం

image

TG: ఫార్ములా-ఈ రేస్ కేస్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ స్టేట్‌మెంట్‌ను ఏసీబీ రికార్డు చేసింది. దీని ఆధారంగా ఏసీబీ విచారణను ప్రారంభించనుంది. కేటీఆర్, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌కు నోటిసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ-రేస్‌లో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని దాన కిషోర్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

News December 25, 2024

రోడ్డు పక్కన 52 కేజీల బంగారం, రూ.11 కోట్ల డబ్బు.. ఇతనివే!

image

మధ్యప్రదేశ్ భోపాల్‌లో ఇటీవల రోడ్డు పక్కన కారులో 52 కేజీల <<14936521>>బంగారం<<>>, రూ.11 కోట్ల నగదు లభ్యమైన విషయం తెలిసిందే. ఇది బిల్డర్‌గా మారిన ఆర్టీవో మాజీ కానిస్టేబుల్‌ సౌరభ్ శర్మ అనుచరుడు చేతన గౌర్‌కు చెందిన కారుగా గుర్తించారు. తాజాగా, లోకాయుక్త పోలీసుల తనిఖీల్లో మాజీ కానిస్టేబుల్ సౌరభ్ ఇంట్లో రూ.2.87 కోట్ల నగదు, 234 కేజీల వెండిని సీజ్ చేశారు. వీరిద్దరిపై ఈడీ కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేస్తోంది.