News May 18, 2024
మా సపోర్ట్ ఆర్సీబీకే

చిన్నస్వామి స్టేడియంలో ప్రముఖులు సందడి చేస్తున్నారు. హీరో రిషబ్ శెట్టి, క్రిస్ గేల్, మహిళా క్రికెటర్లు స్మృతి మంధాన, శ్రేయాంక పాటిల్, ఆశా శోభన, జెమిమా రోడ్రిగ్స్ బెంగళూరు జట్టుకు మద్దతుగా స్టేడియానికి వచ్చారు. ఆర్సీబీ జెర్సీలో స్టేడియానికి వచ్చిన వారు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
Similar News
News November 26, 2025
NRPT: వీసీసీఎం పోస్టుల ప్రొవిజనల్ లిస్ట్ విడుదల

నేషనల్ హెల్త్ మిషన్ కింద కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసే వాక్సిన్ కోల్డ్ చైన్ మొబిలైజర్ (VCCM) పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థుల ప్రొవిజనల్ జాబితాను జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయం విడుదల చేసింది. ఈ జాబితాను నవంబర్ 26 నుంచి డిసెంబర్ 28 వరకు చూడవచ్చని డీఎంహెచ్‌ఓ కె.జయచంద్రమోహన్ తెలిపారు. అభ్యంతరాలను డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో నివేదించవచ్చు.
News November 26, 2025
మెదక్: మల్లన్న సాగర్ నీ తాత కట్టిండా.? సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు ఫైర్.!

మల్లన్న సాగర్ ఎవరు కట్టారు.. నీ తాత కట్టిండా? అంటూ సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ధ్వజమెత్తారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల వద్ద పేల్చిన చెక్ డ్యామ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మానేరు నదిపై నిర్మించిన చెక్ డ్యామ్‌ను కూల్చివేసింది కాంగ్రెస్ నేతలేనన్నారు. కాంగ్రెస్ హయంలో చెరువులు, చెక్ డ్యామ్‌ల పేల్చివేత నిత్య చర్యగా మారిందన్నారు.
News November 26, 2025
పరకామణి కేసు.. ఎస్టేట్ విభాగంపై విచారణ.!

తిరుమల పరకామణి కేసులో ఎస్టేట్ విభాగానికి సంబంధించి మంగళవారం పూర్తిస్థాయి విచారణ సాగినట్లు సమాచారం. రవి కుమార్ ఆస్తులు బదిలీ, ఎలా ఎప్పుడు తీసుకున్నారు. ఎవరు మధ్యవర్తిత్వం చేశారన్న విషయంపై మాట్లాడారు. దానిలో ఎవరిపాత్ర ఉందనే అంశాలపై సీఐడీ అధికారులు విచారించారు. అసలు ఎస్టేట్ విభాగానికి సంబంధించి ఆస్తుల విరాళానికి ఎలాంటి నిబంధనలు ఉన్నాయనేకోణంలో విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.


